అటు తన మెట్టినిల్లు అయిన తమిళ ఇండస్ట్రీలో కూడా రోజాకు ఇబ్బంది తప్పదు. ఎందుకుంటే గతంలో చంద్రబాబును పొగిడారన్న కారణంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను దారుణంగా అవమానించారు రోజాఅండ్ బ్యాచ్. దాంతో ఆమెకు అక్కడ కూడా అవకాశాలు కష్టమే అని చెప్పుకోవాలి. కాని తన భర్త సెల్వమని నిర్మాత కావడం.. ఆయన పలుకుపడితో ఏమైనా సినిమాలు చేస్తే చేయొచ్చు అనే వాదన కూడా ఉంది. అయితే అసలు ఇంతకీ రోజా నిర్ణయం ఏంటీ..? ఆమె సినిమాలు చేస్తుందా.. లేక ఇలా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండిపోతుందా అనేది చూడాలి.