రవితేజ `మాస్‌ జాతర` టీజర్‌ రివ్యూ.. టీజర్‌ బాలేదంటూ నెటిజన్‌ కామెంట్‌.. రాజేంద్రప్రసాద్‌ ఏం చేశాడంటే?

Published : Aug 11, 2025, 11:59 AM IST

రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `మాస్‌ జాతర`. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. రవితేజ మార్క్ మాస్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్స్, రొమాన్స్ మేళవింపుగా ఉంది. 

PREV
16
రవితేజ `మాస్‌ జాతర` టీజర్‌ వచ్చేసింది

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం `మాస్‌ జాతర` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇది రవితేజ నటిస్తోన్న 75వ సినిమా కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలో చాలా కేర్‌ తీసుకున్నారు. తన కెరీర్‌ లో మైల్‌ స్టోన్‌గా నిలిచిపోయే మూవీగా ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారు. తన మార్క్ మాస్ యాక్షన్‌, కామెడీ, రొమాన్స్ ని మేళవించి ఈ మూవీని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం `మాస్‌ జాతర` టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో మాస్‌ మహారాజా మార్క్ యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పుష్కలంగా ఉంది.

DID YOU KNOW ?
రవితేజ చివరగా
రవితేజ చివరగా `మిస్టర్‌ బచ్చన్‌` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది.
26
రవితేజ `మాస్‌ జాతర` టీజర్‌ ఎలా ఉందంటే?

టీజర్‌లో ఏం చూపించారనేది చూస్తే, ఒక గోడౌన్‌లో యాక్షన్‌ సీన్‌తో టీజర్‌ ప్రారంభమైంది. రవితేజ యాక్షన్‌ షురూ చేశారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో` ఇతను ఒక కాలేజీ స్టూడెంట్ ని చంపేశాడు సార్‌` అని మురళీ శర్మ వాయిస్‌ వినిపిస్తుంది. మరోవైపు చికెన్‌ బిర్యానీ తింటూ తన యాక్షన్‌ తో  విలన్లకి చుక్కలు చూపిస్తుంటాడు రవితేజ. `వాడి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటీ` అని బ్యాక్‌ గ్రౌండ్‌ ఓ వాయిస్‌ వినిపించగా, పోలీస్‌ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు రవితేజ. ఇందులో ఆయన `క్రాక్‌` సినిమాలోని లుక్‌ని తలపిస్తుంది. రైల్వే పోలీస్‌గా రవితేజ మరోసారి యాక్షన్‌తో అదరగొట్టాడు.

36
అదిరిపోయేలా శ్రీలీలతో రొమాన్స్

`ఆయన డిపార్ట్ మెంట్‌ తప్ప అన్ని డిపార్ట్ మెంట్‌లో వేలుపెడుతుంటాడ`ని మరో వాయిస్‌ వినిపించగా, రవితేజ రెచ్చిపోయారు. కట్‌ చేస్తే శ్రీలీల ఎంట్రీ. రైల్వే స్టేషన్‌లో రవితేజకి తారసపడుతుంది శ్రీలీల. ఆమెని చూసి ఫిదా అయిన మాస్‌ మహారాజా సైన్స్ అంటే నాకు మస్త్ ఇష్టమని చెబుతాడు. అంతటితో ఆగలేదు, ఇంటర్మీడియట్‌లో వందకు వంద వచ్చాయని చెప్పి దొరికిపోతాడు. ఇద్దరి మధ్య కాసేపు రొమాన్స్ నడుస్తుంది. ఓ పాట కూడా వస్తుంది.

46
రాజేంద్రప్రసాద్‌ కామెడీ కేక

అనంతరం రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వస్తూ, `నాకంటూ ఓ హిస్టరీ ఉంది` అని చెబుతూ విలన్లని మడతపెట్టి కొడుతుంటాడు. ఇంతలో రాజేంద్రప్రసాద్‌ని కొందరు విలన్లు పట్టుకోగా, `డిస్టర్బ్ చేశారనుకోండి, చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడ`ని రవితేజకి ఎలివేషన్‌ ఇచ్చారు. దీంతో మరింతగా రెచ్చిపోతాడు మాస్‌ మహారాజా. కట్‌ చేస్తే చివర్లో ఇంట్లో  రాజేంద్రప్రసాద్‌ ఫోన్‌లో సీరియస్‌గా ఛాటింగ్‌ చేస్తూ, `ట్విట్టర్లో ఒకడు మా హీరో  టీజర్‌ బాగా లేదని కామెంట్‌ పెట్టాడు. వాడిని తగులుకున్నాం. అడ్రస్‌ పెట్టు .. అడ్రస్‌ పెట్టు` అంటూ రాజేంద్రప్రసాద్‌ ఊగిపోతున్నాడు. ఇంతలో కల్పించుకుని `అడ్రస్‌ పెడితే ఏం చేస్తావ్‌.. స్విగ్గిలో ఆర్డర్‌ పెడతావా` అంటూ రవితేజ వేసిన సెటైర్ అదిరిపోయింది. అదే సమయంలో సీరియస్‌గా ఫోన్‌లో ఛాట్‌ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం అదిరిపోయాయి.

56
వింటేజ్‌ రవితేజని చూపించిన `మాస్‌ జాతర` టీజర్‌

ఇలా రవితేజ `మాస్‌ జాతర` టీజర్‌ మాత్రం అన్ని మసాలాలు ఉన్న టీజర్‌గా అనిపిస్తుంది. మాస్‌తో కూడిన యాక్షన్‌ ఉంది, కామెడీ ఉంది,  రొమాన్స్ ఉంది. ఇవన్నీ మేళవింపుతో మంచి కమర్షియల్‌ మూవీని తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఉన్నాయి. రవితేజ వింటేజ్ ఎనర్జీతో కనిపిస్తున్నారు.  తనదైన చురుకుదనం, కామెడీ టైమింగ్ తో కట్టిపడేశారు. రవితేజ, శ్రీలీల మధ్య రొమాన్స్ కూడా బాగానే ఉంది.

66
వినాయక చవితికి `మాస్‌ జాతర` సినిమా విడుదల

ఈ చిత్రం గురించి యూనిట్‌ చెబుతూ, `దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతోపాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా అసలైన పండుగ సినిమాలా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. వినాయకచవితికి సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ కోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. టీజర్ లో నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన లభించింది. ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ నవీన్ నూలి ఎప్పటిలాగే సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తున్నారు. వరుసగా ప్రేక్షకులను మెప్పించే చిత్రాలను అందించడంలో ప్రసిద్ధి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై 'మాస్ జాతర' చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 27న వినాయకచవితి పండగ స్పెషల్‌గా విడుదల కానుంది` అని తెలిపింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories