ఆగస్ట్ రెండో వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే.. ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్, ఆహా, సన్‌ నెక్ట్స్ లో అవి రచ్చ

Published : Aug 11, 2025, 10:48 AM IST

ఆగస్ట్ రెండో వారంలో పలు క్రేజీ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి. అందులో అనుపమా మూవీ, `మ్యాడ్‌` హీరో సినిమాలు కూడా ఉండటం విశేషం. 

PREV
18
ఆగస్ట్ రెండో వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

ప్రస్తుతం ఓటీటీ బాగా విస్తరించింది. సినిమాల కోసం ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లడానికంటే ఓటీటీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వందలు వందలు పెట్టి థియేటర్లలో సినిమాలు చూసేందుకు భయపడుతున్నారు. ఒక్క టికెట్‌ ఛార్జ్ తో ఇంటిళ్లిపాది ఇంట్లోనే సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికితోడు మంచి కంటెంట్‌ ఉన్న వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఈక్రమంలో ఓటీటీలో వచ్చే సినిమాలకు, సిరీస్‌లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఆడియెన్స్ వాటి కోసం వెయిట్‌ చేస్తున్నారు. మరి ఆగస్ట్ రెండో వారంలో(ఆగస్ట్ 11 నుంచి 17)   ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.

DID YOU KNOW ?
`పరదా`తో రాబోతున్న అనుపమా
అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు `పరదా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్‌గా రూపొందిన ఈ మూవీ ఆగస్ట్ 22న విడుదల కానుంది.
28
జీ 5లో అనుపమా పరమేశ్వరన్‌ సంచలన మూవీ..

అనుపమా పరమేశ్వరన్‌ మలయాళంలో నటించిన మలయాళ మూవీ `J.S.K - జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ` మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇది గత నెలలో థియేటర్లకి వచ్చింది. అక్కడ టైటిల్‌ విషయంలో వివాదం నెలకొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళకి  జానకి పేరు పెట్టడాన్ని కేరళాలోని కొన్ని హిందుత్వ సంఘాలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. టైటిల్‌లో చిన్న మార్పుతో విడుదల చేశారు. అక్కడ డీసెంట్‌గా ఆడింది. ఇప్పుడిది ఓటీటీలోకి రాబోతుంది. జీ 5లో ఆగస్ట్ 15 నుంచి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌తోపాటు సురేష్‌ గోపీ కీలక పాత్ర పోషించారు. లైంగిక వేధింపులు ఫేస్‌ చేసిన జానకిగా అనుపమా నటించింది. దీనికి ప్రవీణ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించగా, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ఓటీటీలోకి రాబోతున్న ఈ మూవీపై అందరి చూపు ఉంది.

38
`తెహ్రాన్‌`తో రాబోతున్న జాన్‌ అబ్రహం

దీంతోపాటు జీ 5లో హిందీ మూవీ `తెహ్రాన్‌` స్ట్రీమింగ్‌ కాబోతుంది. జాన్‌ అబ్రహం, మనుషీ చిల్లర్‌ జంటగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి అరుణ్‌ గోపాలన్‌ దర్శకత్వం వహించారు. మడ్డాక్‌ ఫిల్మ్స్ నిర్మించింది. సినిమాలో వివాదాస్పద కంటెంట్‌ ఉన్న నేపథ్యంలో దీన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

48
ఈటీవీ విన్‌లో `కానిస్టేబుల్‌ కనకం`

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన `కానిస్టేబుల్‌ కనకం` వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి రాబోతుంది. దీనికి ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. కాప్‌ డ్రామాగా ఇది రూపొందింది. థ్రిల్లర్‌ అంశాల మేళవింపుగా దీన్ని తెరకెక్కించారు. కానిస్టేబుల్‌ అయిన కనకం ఓ అమ్మాయి మిస్టరీ కేస్‌ని ఛేదించే క్రమంలో ఫేస్‌ చేసిన సంఘటనల సమాహారంగా దీన్ని రూపొందించారు. ఈ మూవీ ఈటీవీ విన్‌లో ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల ముఖ్య పాత్రలు పోషించారు.

58
సన్‌ నెక్ట్స్ లో రాబోతున్న `మ్యాడ్‌` హీరో మూవీ `గ్యాంబ్లర్స్`

`మ్యాడ్‌` సిరీస్‌తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు కుర్ర హీరో సంగీత్‌ శోభన్‌. ఇందులో తనదైన స్టయిల్లో కామెడీ చేసి మెప్పించారు. ఆయన సోలో హీరోగా నటించిన మూవీ `గ్యాంబ్లర్స్`. ఈ చిత్రం జూన్‌ 6న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్ట్ 14న దీన్ని ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. సన్‌ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇందులో సంగీత్‌ శోభన్‌తోపాటు ప్రశాంతి హీరోయిన్‌గా నటించగా, కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించారు. ఇది ఐదుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ.

68
ప్రైమ్‌ వీడియోస్‌లో క్రేజీ మూవీస్‌, సిరీస్‌లు

`అందేరా` సీజన్‌ 1 

`అందేరా` అనే హిందీ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 14 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో ప్రజాక్త కోలి, సుర్వీన్‌ చావ్లా, ప్రియా బపత్‌, కరణ్‌వీర్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. రాఘవ్‌ డార్‌ దర్శకత్వం వహించారు. రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌, కాస్సిమ్‌ జగ్మాజియా, విశాల్‌ రామ్‌ చందాని, మోహిత్‌ షా, కరణ్‌ అన్షుమాన్‌ కలిసి నిర్మించారు. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

78
`బట్టర్‌ ఫ్లై` సీజన్‌ 1

హాలీవుడ్‌ సిరీస్‌ `బట్టర్‌ ప్లై` సీజన్‌ వన్‌ కూడా ఓటీటీలోకి వస్తుంది. ప్రైమ్‌ వీడియోస్‌లో ఇది ఆగస్ట్ 13 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. అలాగే `సాసేజ్‌ పార్టీః ఫూడ్‌టోపియా` సీజన్‌ 2 యానిమేషన్‌ సిరీస్‌ ఆగస్ట్ 13నే స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనికితోడు `అబాండోన్డ్ః ది ఉమె్‌ ఇన్‌ ది డికేయింగ్‌ హౌజ్‌` అనే హాలీవుడ్‌ సిరీస్‌ కూడా ఆగస్ట్ 15న స్ట్రీమింగ్‌ అవుతుంది.

జీయో హాట్‌ స్టార్‌లో...

ఈ రోజు నుంచి రెండు సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వాటిలో ఫైసల్‌ షేక్‌, షెఫాలీ బగ్గా కలిసి నటించిన `లవెంచర్‌` సిరీస్‌ నేడు(ఆగస్ట్ 11)న జీయో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. మరో సిరీస్‌ `మన్‌పసంద్‌ కి షాది` కూడా నేటి నుంచే జీయో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

88
నెట్‌ ఫ్లిక్స్ లో `సారే జహాన్‌ సే అచ్చా`..

హిందీలో రూపొందిన క్రేజీ మూవీ `సారే జహాన్‌ ఏ అచ్చా` ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 13న ఇది నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీలో ప్రతీక్‌ గాంధీ, సన్నీ హిందుజా, సుహైల్‌ నయ్యర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గౌరవ్ శుక్లా రూపొందించారు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories