చిరంజీవి `ముగ్గురు మొనగాళ్లు`ని చావు దెబ్బ కొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. నాగబాబు జీర్ణించుకోలేని సందర్భం

Published : Aug 11, 2025, 07:38 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి `ముగ్గురు మొనగాళ్ల` సినిమాని సూపర్‌ స్టార్‌ కృష్ణ తన `నెంబర్‌ వన్‌` మూవీతో చావు దెబ్బ కొట్టాడు. సంక్రాంతికి బంపర్‌ హిట్‌ కొట్టాడు. 

PREV
15
కృష్ణతో పోటీ పడ్డ చిరంజీవి

సినిమాల విషయంలో టాప్‌ హీరోల మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సార్లు క్లాష్‌ గట్టిగానే ఉంటుంది. ఒకే డేట్‌కి వచ్చి పోటీ పడ్డ సందర్భాలు చాలానే ఉంటాయి. అదే సమయంలో వారం గ్యాప్‌తో  కూడా పోటీ పడి, ఒక సినిమాని మరో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టడం కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. అయితే చిరంజీవి, సూపర్‌ స్టార్‌ కృష్ణ విషయంలో ఇది చాలా సార్లే జరిగింది. ఓ సమయంలో మెగాస్టార్‌ `ముగ్గురు మొనగాళ్లు`ని చావు దెబ్బ కొట్టారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. మరి మూవీ ఏంటీ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. 

DID YOU KNOW ?
`జగదేక వీరుడు` తర్వాత
`జగదేక వీరుడు అతిలోక సుందరి` వంటి సోషియో ఫాంటసీ తర్వాత మళ్లీ అలాంటి జోనర్‌లోనే `విశ్వంభర` చేస్తున్నారు చిరు. వీఎఫ్‌ఎక్స్ వల్ల ఈ మూవీ డిలే అవుతోంది.
25
నాగబాబు నిర్మాతగా `ముగ్గురు మొనగాళ్లు` చేసిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన మూవీ `ముగ్గురు మొనగాళ్లు`. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, నగ్మ, రోజా హీరోయిన్లుగా నటించారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించారు. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన  ఈ చిత్రం 1994లో జనవరి 7న విడుదలైంది. చిరు మూడు పాత్రలు చేయడంతో ఆడియెన్స్ ప్రారంభంలో ఎగబడి చూశారు. పైగా ముగ్గురు హీరోయిన్లు ఉండటంతో గ్లామర్‌కి కొదవ లేదు. దీంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. మొదటివారం బాగానే ఉంది. రెండో వారం పుంజుకునే లోపే కృష్ణ దెబ్బకొట్టాడు.

35
`నెంబర్‌ వన్‌`తో దుమ్ములేపిన సూపర్‌ స్టార్‌ కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన `నెంబర్‌ వన్‌` మూవీ జస్ట్ వన్‌ వీక్‌ గ్యాప్‌తో వచ్చింది. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైంది. ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఎస్వీకృష్ణా రెడ్డి జోరు మామూలుగా లేదు.  ఆయన తీసిన ప్రతి సినిమా హిట్టే అనేట్టుగా సాగింది. పైగా ఆ సమయంలో కృష్ణ పీక్‌లో ఉన్నారు. సౌందర్య స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుంది. దీనికితోడు సూపర్‌ స్టార్‌తో మంచి ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాని తెరకెక్కించారు ఎస్వీకృష్ణారెడ్డి. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్లు ఉండటంతో సినిమాకి జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది.

45
కృష్ణతో పోటీలో బోల్తా పడ్డా చిరంజీవి

ఈ క్రమంలో చిరంజీవి `ముగ్గురు మొనగాళ్ల`ని కోలుకోలేని దెబ్బకొట్టింది సూపర్‌ స్టార్‌ కృష్ణ `నెంబర్‌ వన్‌`. చిరు మూవీ ప్రారంభంలో బాగానే ఆడినా, అసలైన సంక్రాంతి సీజన్‌కి గట్టి దెబ్బ పడింది. దీంతో మూవీ జస్ట్ యావరేజ్‌గా మారిపోయింది. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇది  నిర్మాత నాగబాబుకి కొంత నష్టాలను తీసుకొచ్చింది. ఇందులో చిరంజీవి మూడు పాత్రలు పోషించినా, ఆ సమయంలో కృష్ణ జోరు ముందు నిలబడలేకపోయింది. ఇలా కృష్ణ `నెంబర్‌ వన్‌` చేతిలో చిరు `ముగ్గురు మొనగాళ్లు`  గట్టి దెబ్బ తిన్నారని చెప్పొచ్చు.

55
మూడు సినిమాలతో చిరంజీవి బిజీ

ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. కాకపోతే వీఎఫ్‌ఎక్స్ విషయంలో డిలే అవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళికిగానీ, లేదంటే డిసెంబర్‌లోగానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు అనిల్‌ రావిపూడితో `మెగా157` సినిమా చేస్తున్నారు చిరు. వింటేజ్‌ చిరంజీవి చూపిస్తూ, ఆయన మార్క్ కామెడీ, యాక్షన్‌ మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనిల్‌ రావిపూడి. ఈ మూవీ సంక్రాంతి రాబోతుంది. వీటితోపాటు శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు చిరు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories