మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ, రాజేంద్ర ప్రసాద్ పై ట్రోలింగ్ జరుగుతోంది.
మాస్ మహారాజ్ అని ఫ్యాన్స్ రవితేజని ముద్దుగా పిలుస్తుంటారు. తనకి ఉన్న బిరుదుకి తగ్గట్లుగానే రవితేజ ఇటీవల మాస్ సినిమాలు చేస్తున్నారు. కానీ ఆ చిత్రాలు అంతగా వర్కౌట్ కావడం లేవు. దారుణమైన ఫ్లాపులుగా మారుతున్నాయి. దీనితో రవితేజ ఒక్కసారి తన సినిమాలని, ఎంచుకుంటున్న కథలని రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా రవితేజ నుంచి మాస్ జాతర అనే చిత్రం రిలీజ్ అయింది.
26
మాస్ జాతరకి ప్రేక్షకుల రెస్పాన్స్ ఇదే
భాను భోగవరపు దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన మాస్ జాతర చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. దీనితో రవితేజ కెరీర్ లో ఫెయిల్యూర్ చిత్రాల జాబితాలో మాస్ జాతర చేరిపోయింది అని ప్రేక్షకులు అంటున్నారు. రవితేజకి ఇది వరుసగా ఐదవ ఫ్లాప్ చిత్రం. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మాస్ జాతర మూవీ ఆ జాబితాలో చేరింది.
36
గత మూడేళ్ళలో రవితేజ చేసిన సినిమాలు
గత ముడేళ్ళల్లో రవితేజ సినిమాలు గమనిస్తే.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర చిత్రాలు చేశారు. వీటిలో ధమాకా మాత్రమే హిట్ అయింది. మిగిలిన చిత్రాలు నిరాశపరిచాయి. దీని రవితేజకి ఏమైంది.. చిరాకు పుట్టించే పరమ రొటీన్ కథలు ఎందుకు ఎంచుకుంటున్నారు అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రవితేజపై ట్రోలింగ్ జరుగుతోంది. అసలు రవితేజకి మాస్ మహారాజ్ అనే బిరుదు తొలగించాలి. తన పేరులో మాస్ ఉండడం వల్ల రొటీన్ మాస్ సినిమాలే చేయాలి అని అనుకుంటున్నాడేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ ఒకప్పుడు ఖడ్గం, నేనింతే, నా ఆటోగ్రాఫ్ లాంటి వైవిధ్యమైన అద్భుతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు పూర్తిగా మూస ధోరణిలో మునిగిపోయారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
56
రాజేంద్ర ప్రసాద్ పై ట్రోలింగ్
మరోవైపు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల ఆయన మీడియా సమావేశాల్లో, ఈవెంట్లలో నోరు జారుతున్న సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. అంతకు ముందు పుష్ప సినిమాపై, అదే విధంగా డేవిడ్ వార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ మాస్ జాతర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నేనేమీ చెప్పను. అన్ని మసాలాలు కరెక్ట్ గా ఉన్న మాస్ మూవీ ఇది.
66
ఇండస్ట్రీని వదిలేస్తా
ఈ సినిమా చూసి థియేటర్స్ లో మీరు షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సినిమా చూసిన అభిమానులు.. రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు అంతగా షాక్ అయ్యేలా ఏముంది అని సెటైర్లు వేస్తున్నారు. గతంలో నాగవంశీ కూడా వార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాగే మాట్లాడి ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.