కొడుకు మార్క్ శంకర్‌ ఆరోగ్యంపై స్పందించిన పవన్‌.. ఇప్పుడు ఎలా ఉందంటే? అన్న చిరుతో కలిసి సింగపూర్‌ ప్రయాణం

Published : Apr 08, 2025, 08:36 PM IST

Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్‌ లో చదువుకుంటున్న స్కూల్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మార్క్ శంకర్‌తోపాటు మరికొంత మంది చిన్నారులు గాయాలపాలయ్యారు. వారిని రిస్క్యూ టీమ్‌ కాపాడి ఆసుపత్రికి తరలించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్‌ కళ్యాణ్‌ టీమ్‌ మీడియాకి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అప్‌ డేట్‌ ఇచ్చారు పవన్‌కళ్యాణ్‌. తన కుమారుడు మార్క్ శంకర్‌ ఆరోగ్యం ఎలా ఉందో వెల్లడించారు.   

PREV
14
కొడుకు మార్క్ శంకర్‌ ఆరోగ్యంపై స్పందించిన పవన్‌.. ఇప్పుడు ఎలా ఉందంటే? అన్న చిరుతో కలిసి సింగపూర్‌ ప్రయాణం
Pawan Kalyan

Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ కొడుకు మార్క్ శంకర్‌ గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో తాను చదువే స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అందులో మార్క్ శంకర్‌ కి గాయాలయ్యాయి. చేతికి కాళ్లకి గాయాలైనట్టు తెలిపింది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే తాజాగా పవన్‌ కళ్యాణ్‌ రియాక్ట్ అయ్యారు. తన కొడుకు ఆరోగ్యంపై ఆయన స్పందించింది. ప్రస్తుతం మార్క్ శంకర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, క్రమంగా కోలుకుంటున్నట్టు తెలిపారు. 
 

24
Pawan Kalyan son

ఈ సందర్భంగా అభిమానులకు భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొడుకు కోలుకోవాలని ప్రార్థనలు చేసి, తనని వాకాబు చేసిన సినీ, రాజకీయ ప్రముఖులకు పవన్‌ కళ్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. తన కొడుకు కోసం ఇంత మంది రియాక్ట్ కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

34
pawan kalyan about son

ఈ సందర్భంగా పీఎం మోడీకి, సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి, మంత్రులు నారా లోకేష్‌, ఇతర మంత్రులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్‌ ఒక నోట్‌ని విడుదల చేశారు. 

44
Pawan Kalyan , chiranjeevi

ఇదిలా ఉంటే కొడుకు ఆ స్థితిలో ఉన్నా కూడా తన కార్యక్రమాలే ముఖ్యమని భావించిన పవన్‌ కళ్యాణ్‌ మన్యం జిల్లాల్లో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే రచ్చ బండ కార్యక్రమం కూడా నిర్వహించారు.

సాయంత్రం వరకు ప్రజలతోనే ప్రభుత్వ కార్యక్రమాలతోనే బిజీగా ఉన్న ఆయన ఈ సాయంత్రం సింగపూర్‌కి బయలు దేరి వెళ్లిపోయారు. అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి ప్రత్యే విమానంలో సింగపూర్‌కి వెళ్లినట్టు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories