బాలకృష్ణ హోస్ట్ గా `బిగ్‌ బాస్‌ తెలుగు 9`?.. నాగార్జునని తప్పిస్తున్నారా? అసలేం జరుగుతుందంటే?

Published : Apr 08, 2025, 07:29 PM ISTUpdated : Apr 09, 2025, 10:06 AM IST

Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షోకి మన వద్ద సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఒక సెపరేట్‌ క్రేజ్‌ కూడా ఉంది. ఈ షో ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక రెండు మూడు సీజన్లు తప్పితే మిగిలిన సీజన్లలో షో రక్తికట్టేలా లేదని, పెద్దగా సక్సెస్‌ కాలేదని అంటుంటారు. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. గత ఆరు సీజన్లకి ఆయనే హోస్ట్. అయితే ఇప్పుడు ఆయన్ని తప్పిస్తున్నారని, బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి బాలకృష్ణని హోస్ట్ గా తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇంతకి బిగ్‌ బాస్‌ షో విషయంలో ఏం జరుగుతుందనేది చూస్తే. 

PREV
15
బాలకృష్ణ హోస్ట్ గా `బిగ్‌ బాస్‌ తెలుగు 9`?.. నాగార్జునని తప్పిస్తున్నారా? అసలేం జరుగుతుందంటే?
balakrishna, bigg boss telugu 9, nagarjuna

Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్‌ తెలుగు ఫస్ట్ సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేశాడు. ఆయన హోస్టింగ్‌ బాగుందనే టాక్ వినిపించింది. తెలుగులో మొదటి షో కావడంతో చాలా వరకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి ఆయన తప్పుకున్నారు. రెండో సీజన్‌కి నాని హోస్టింగ్‌ చేశారు. ఆ సీజన్‌ టైమ్‌లో కూడా మంచి పేరొచ్చింది.

కంటెస్టెంట్లు కూడా అంతా తెలిసిన వాళ్లే ఉండటంతో ఆ సీజన్‌కి కలిసొచ్చింది. మూడో సీజన్‌ కి నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్‌ కూడా బాగానే ఆదరణ పొందింది. గొడవలు, లవ్‌ ట్రాక్‌ లు బాగా రేటింగ్‌ని తీసుకొచ్చాయి. నాల్గో సీజన్‌ కూడా కాస్త ఫర్వాలేదనిపించింది.

25
bigg boss telugu 9, nagarjuna

కానీ ఐదో సీజన్‌, ఆరో సీజన్‌ ఫెయిల్‌ అయ్యాయి. ఏడో సీజన్‌ పెద్ద హిట్‌ అయ్యింది. కానీ గత సీజన్‌ కూడా బాగా డల్‌ అయ్యింది. షోలో చాలా మార్పులు చేసినా సక్సెస్‌ కాలేదు. దీనికి కారణం హోస్ట్ నాగార్జుననే అని, ఆయన్ని మార్చేయాలనే వాదన ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇటీవల సరికొత్త రూమర్లు వినిపిస్తున్నాయి.

విజయ్‌ దేవరకొండ పేరు హోస్ట్ గా వినిపించింది. అలాగే చాలా కాలంగా రానా పేరు చక్కర్లు కొడుతుంది. కానీ వీళ్లెవరూ హోస్ట్ గా చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. బాలకృష్ణ బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి హోస్ట్ గా చేస్తే ఎలా ఉంటుందనే వాదన ప్రారంభమైందట. 
 

35
bigg boss telugu 9, nagarjuna

నాగార్జునని తప్పించి బాలకృష్ణని హోస్ట్ గా తీసుకురావాలనుకుంటున్నారట. బాలయ్య హోస్ట్ గా చేసిన `అన్‌ స్టాపబుల్‌` షో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. బాగా రేటింగ్‌ వచ్చింది. ఇండియాలోనే టాప్‌ రేటింగ్‌ షోగానూ నిలిచింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావడంతో షో రేంజ్‌ పెరిగిపోయింది. అందుకే మంచి రేటింగ్‌ వచ్చింది. మూసలో నడిచే షోల ట్రెండ్‌ ని ఇది బ్రేక్‌ చేసింది.

మరోవైపు బాలయ్యలోని కొత్త యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేసింది. ఇదే ఈ షో సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు. దీంతో బాలయ్య బిగ్‌ బాస్‌ షోకి హోస్ట్ గా చేస్తే అలానే సంచలనంగా మారుతుందని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది సాధ్యమా? ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనేది చూస్తే. 
 

45
Bigg boss telugu 8

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు బాలయ్య.. బిగ్‌ బాస్‌ షోకి తీసుకురావడమనేది వాస్తవం కాదని తెలుస్తుంది. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదని సమాచారం. నాగార్జునతో పది సీజన్ల వరకు అగ్రిమెంట్‌ ఉంది. దాన్నే కంటిన్యూ చేయబోతున్నారట.

ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తుంది. అయితే గేమ్‌ ప్లాన్స్ లో, షోలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పాపులర్‌ సెలబ్రిటీలను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇలాంటి కొన్ని మార్పులు తప్ప, హోస్ట్ ని మార్చడమనేది లేదని సమాచారం. 
 

55
balakrishna

ఒకవేళ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంలో నెగటివ్‌ రియాక్షన్‌ వస్తుంది. స్పాంటినిటీగా స్పందించాల్సిన విషయంలో బాలయ్య దొరికిపోతాడని, ఆయనకు రియాక్షన్‌ ఓపెన్‌గా ఉంటుంది, కానీ లాజికల్ గా ఉండదు, అదే ఇక్కడ దెబ్బ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అన్‌ స్టాపబుల్‌ షోలో ఒక గెస్ట్ తో కన్వర్జేషన్‌ ఉంటుంది. ఆయన క్వశ్చన్స్ అడిగితే గెస్ట్ లు ఆన్సర్‌ చెబుతారు, అది సరదా కన్వర్జేషన్‌. కానీ ఇక్కడ కంటెస్టెంట్ల మెంటాల్టీ గురించి, వారి ఆట తీరు గురించి, గేమ్‌ ప్లానింగ్‌ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. చాలా లాజికల్‌గా ఉంటుంది, డిప్లామాటిక్‌గానూ ఉంటుంది.

అది బాలయ్యతో కాదనే వాదన వినిపిస్తుంది. బాలయ్య బిగ్‌ బాస్‌ షోకి హోస్ట్ అనేది క్రేజీగా ఉన్నా, డీల్‌ చేసే విషయంలో మాత్రం తేడా కొడుతుంది అనే వాదన వినిపిస్తుంది. మరి బిగ్‌ బాస్‌ నిర్వహకులు ఏం చేయబోతున్నారో వేచి చూడాలి. 

read  more: Lenin Glimpse: పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది.. అఖిల్‌కి ఇన్నాళ్లకి సరైన సినిమా పడిందా?

also read: Friday Releases: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో తెలుసా? మూవీ లవర్స్ కి పండగే పండగ

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories