అల్లు అర్జున్, అట్లీ సినిమాల్లో సమంత
గతంలో ప్రియాంక చోప్రా పేరు వినిపించినప్పటికీ, అట్లీ - అల్లు సినిమాలో ఆమె లేరని తేలిపోయింది. అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంలో సమంత డాన్స్ పాన్ ఇండియా స్థాయిలో వైరల్ అయింది.
దీంతో గత రెండేళ్లుగా సినిమా వైపు చూడకుండా ఉన్న సమంత, ఇప్పుడు అట్లీ - అల్లు అర్జున్ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో `మెర్సల్`, `తేరి` వంటి చిత్రాల్లో నటించింది సామ్.
అలాగే అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేసింది సమంత. `సన్నాఫ్ సత్యమూర్తి`లో జోడీ కట్టారు. ఇది వచ్చి పదేళ్లు అవుతుంది. `పుష్ప`లోఐటెమ్ సాంగ్ పక్కన పెడితే హీరోయిన్‌గా పదేళ్ల తర్వాత బన్నీతో సమంత రొమాన్స్ చేయబోతుందని చెప్పొచ్చు. ఇదే నిజమైతే సమంతకిది జాక్ పాటే అని చెప్పొచ్చు.