అల్లు అర్జున్‌ వివాదంలో ఇండస్ట్రీ మౌనానికి కారణమిదే.. మంచు విష్ణు బయటపెట్టిన నిజాలు

Published : Mar 19, 2025, 07:53 AM ISTUpdated : Mar 19, 2025, 01:50 PM IST

Manchu vishnu-allu arjun: అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌ వివాదంలో చిత్ర పరిశ్రమ మౌనంగా ఉండటంపై మంచు విష్ణు స్పందించారు. అలా ఎందుకు చేయాల్సిందో చెప్పారు. అలాగే అప్పటి సీఎం జగన్‌కి చిరంజీవి దెండం పెట్టడంపై స్పందించారు.   

PREV
16
అల్లు అర్జున్‌ వివాదంలో ఇండస్ట్రీ మౌనానికి కారణమిదే.. మంచు విష్ణు బయటపెట్టిన నిజాలు
allu arjun, chiranjeevi, manchu vishnu

Manchu vishnu-allu arjun: అల్లు అర్జున్‌ `పుష్ప 2` రిలీజ్‌ ముందు రోజు సంధ్య థియేటర్లో అభిమానుల మధ్య సినిమా చూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఒక మహిళ కన్నుమూశారు.

ఓ కుర్రాడు(తేజ) అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. బన్నీపై కేసులు నమోదు చేశారు. ఆయన్ని అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. 

26
Allu Arjun

ఈ ఘటనలో ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించలేదు. అల్లు అర్జున్‌కి మద్దతుగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రియాక్ట్ కాలేదు. అంతా మౌనం వహించింది. దీనికి కారణాలను బయటపెట్టాడు మంచు విష్ణు.  

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ప్రెసిడెంట్‌ అయిన మంచు విష్ణు హీరోగా నటించిన `కన్నప్ప` మూవీ వచ్చే నెల 25న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జీ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఆసక్తికర విషయాలను, పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. 

36
Telangana Chief Minister Revanth Reddy

అల్లు అర్జున్‌ కేసు విషయంలో ఇండస్ట్రీ కావాలనే మౌనంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లకూడదు, ఎవరూ మాట్లాడకూడదని ఇండస్ట్రీ నుంచి అందరికి సందేశాలు వెళ్లినట్టు చెప్పారు. అందుకే ఈ విషయంలో ఎవరూ స్పందించలేదు. ప్రభుత్వాలకు సినిమా పరిశ్రమ ఎప్పుడూ వ్యతిరేకం కాదు, వాళ్లకు అనుకూలంగా ఉంటూ తమకి కావాల్సిన పనులు చేయించుకోవాలి.

తమకు కావాల్సిన బెనిఫిట్స్ ని రిక్వెస్ట్ చేయాలన్నారు మంచు విష్ణు. ఎప్పుడూ ఏ ప్రభుత్వాన్ని పరిశ్రమ విమర్శించదు, వ్యతిరేకంగా మాట్లాడదు అని స్పష్టం చేశారు. అందుకే బన్నీ వివాదం విషయంలో అంతా సైలెంట్‌గా ఉన్నారని చెప్పారు. 
 

46
manchu vishnu

అయితే అల్లు అర్జున్‌ అరెస్ట్ తర్వాత ఒక రోజు జైల్లో ఉన్నారు. ఆ మరుసటి రోజు ఆయన్ని విడుదల చేశారు. ఆ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు పర్సనల్‌గా వెళ్లి అల్లు అర్జున్‌ని కలిశారు. బన్నీకి మద్దతు తెలిపారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు.

తెలంగాణ ప్రభుత్వంతో మీటింగ్‌కి తాను వెళ్లకపోవడానికి కారణం తాను విదేశాల్లో ఉన్నానని, అందుకే వెళ్లలేదని, ఆ విషయాన్ని డిప్యూటీ సీఎంతో మాట్లాడానని చెప్పారు విష్ణు. 

56
chiranjeevi, ys jagan

ఇక అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ ఉన్నప్పుడు సినిమా టికెట్‌ రేట్ల విషయంలో నెలకొన్న వివాదానికి సంబంధించి ఇండస్ట్రీ అంతా వెళ్లింది. చిరంజీవి, ప్రభాస్‌, మహేష్‌, రాజమౌళి, కొరటాల, త్రివిక్రమ్‌, ఆర్‌ నారాయణమూర్తి వంటి వారు వెళ్లి సీఎం జగన్‌ని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి.. సీఎం జగన్‌కి దెండం పెట్టడం అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది. జగన్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 

66
manchu vishnu

తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించారు. అది చిరంజీవిగారి గొప్పతనం అని, ఆయన సీఎం ఛైర్‌కి ఇచ్చిన గౌరవం అని తెలిపారు. ఆ ఛైర్‌ గొప్పది అని, దాన్ని ఎవరైనా రెస్పెక్ట్ చేయాలని, చిరంజీవి అదే చేశారని, నిజానికి ఈ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాలి, ఆయన్నుంచి నేర్చుకోవాలని,

ఎందుకంటే ఎలాంటి సందర్భాన్ని ఎలా డీల్‌ చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆ వివాదాన్ని కూల్‌గా డీల్‌ చేశారు, టికెట్‌ రేట్లు సరిచేయించారని తెలిపారు. అయితే తాను ఆ మీటింగ్‌కి వెళ్లకపోవడానికి కారణం.. తమకు ఆహ్వానం అందిందని, కానీ ఇండస్ట్రీలో అది మిస్‌ కమ్యూనికేట్‌ అయ్యిందన్నారు విష్ణు. 

read  more:OG vs గుడ్ బ్యాడ్ అగ్లీ: రెండు కథలు ఒకేలాంటివా ? !

also read: షారుఖ్ ఖాన్ సినిమాలో విలన్ గా అల్లు అర్జున్ ? ఏ సినిమాలో, డైరెక్టర్ ఎవరు, నిజమెంత?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories