పవన్ హీరో గా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్‌స్టర్ మూవీ ‘ఓజీ’. ఇటీవల పవన్ ఎక్కడకు వెళ్లినా, ‘ఓజీ.. ఓజీ..’ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది.
అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు కథ పరంగా పోలిక ఉందనే ప్రచారం మీడియాలో జరుగుతోంది. అదేంటో చూద్దాం.
పవన్ 'ఓజీ' (OG), అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. రెండు కూడా ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండింటిలోనూ కథ గ్యాంగస్టర్స్ చుట్టూ తిరుగుతుంది.
ముఖ్యంగా హీరో మాఫియా గ్యాంగస్టర్. అతను తమ గతాన్ని వదిలి ప్రస్తుత జీవితం హ్యాపీగా గడుపుతూంటాడు. కానీ గతం అతన్ని వెంబడిస్తుంది. మళ్లీ క్రైమ్ వరల్డ్ తిరిగి పిలుస్తుంది.
తప్పనిసరి పరిస్దితుల్లో తిరిగి క్రైమ్ వరల్డ్ లోకి ప్రవేశించి ఎలా లెక్కలు సెటిల్ చేసాడన్నదే కథాంశం. అయితే ఈ రెండు పేరుకు ఒకే ప్లాట్ లాగ కనిపిస్తున్నా వేర్వేరుగా ట్రీట్మెంట్ చేసారని చెప్తున్నారు. అవే ఈ సినిమాలను ప్రత్యేకంగా నిలబెడతాయని చెప్తున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా.. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.
ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. తమన్ (Thaman) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ నటుడు శింబు (Silambarasan TR) ఓ పాట పాడారు.
ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ‘ఓజీ’ తెరకెక్కుతోంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు సైతం పూర్తి చేయాల్సి ఉంది.