'రాజాసాబ్‌' సాంగ్స్ డస్ట్ బిన్‌లో ఓకే ? మరి మిగతావాటి సంగతేంటి ?

Published : Mar 19, 2025, 07:12 AM IST

ప్రభాస్ రాజా సాబ్ సినిమా కోసం థమన్ ఇంతకుముందు కంపోజ్ చేసిన పాటలన్నీ స్క్రాప్ చేస్తున్నాడు. పాత ట్యూన్స్ ఫ్రెష్ నెస్ కోల్పోవడంతో కొత్త పాటలు చేసే పనిలో ఉన్నట్టు చెప్పాడు.

PREV
13
'రాజాసాబ్‌' సాంగ్స్ డస్ట్ బిన్‌లో ఓకే ? మరి మిగతావాటి సంగతేంటి ?
Prabhas The Raja Saab songs scrapped: Fresh tunes on the way in telugu

టాలీవుడ్‌లో భారీ అంచనాలున్న సినిమాల్లో ప్రభాస్ నటించిన రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ది హాలీవుడ్ రిపోర్టర్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాజా సాబ్ గురించి థమన్ మాట్లాడాడు, ఈ చిత్రం గురించి చాలా విషయాలు వెల్లడించాడు.

సినిమా కోసం ఇంతకుముందు ఆయన కంపోజ్ చేసిన పాటలన్నీ స్క్రాప్ చేస్తున్నానని చెప్పటం ఇందులో  ఆసక్తికర అంశం.

23
Prabhas The Raja Saab songs scrapped: Fresh tunes on the way in telugu


 ఈ ప్యాన్ ఇండియా మూవీ ప్రారంభంలో కంపోజ్ చేసుకున్న ట్యూన్స్ కాల ప్రభావం వల్ల ఫ్రెష్ నెస్ కోల్పోయాయని, అందుకే వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ తాజాగా కొత్త పాటలు చేసే పనిలో ఉన్నట్టు చెప్పాడు.

దానికి కారణాలు కూడా వివరించాడు. ముప్పై నలభై కోట్లు పెట్టి ఆడియో కంపెనీలు హక్కులు కొంటున్నప్పుడు బెస్ట్ ఇచ్చే బాధ్యత సంగీత దర్శకుల మీద ఉంటుందని, అందుకే రాజా సాబ్ కోసం అదనంగా కష్టపడేందుకు సిద్ధమయ్యామని చెప్పుకొచ్చాడు.  

33
Prabhas The Raja Saab songs scrapped: Fresh tunes on the way in telugu


దీంతో ఇప్పటికే చేసిన సాంగ్స్ అన్నీ ట్రాష్‌లో పడేసి మళ్లీ కొత్తగా చేస్తున్నా. ఇదే విషయం డైరెక్టర్‌కి చెప్పా. ఎందుకంటే నేను బాధ్యతగా ఉండాలి కదా.. దీని కోసం చేసిన ట్యూన్స్ డెడ్ అయిపోయాయి..

ఇవి ఇప్పుడు వర్కవుట్ అవ్వవు.. ఎందుకంటే నేను డాకు మహారాజ్, ఓజీ, జాట్ లాంటి చిత్రాల తర్వాత చేస్తున్న సినిమా ఇది. కనుక నేను కూడా అప్‌డేట్ కావాలి.

నేను నా మ్యూజిక్‌ని చీట్ చేయలేను. ఇలా ఉండటమే కరెక్ట్ అన్నారు. దాంతో ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని పాజిటివ్ గా, మరికొన్ని నెగిటివ్ గా వినిపిస్తున్నాయి. పాటలు ఓకే...మొత్తం మార్చి చేస్తారు. కానీ మేకింగ్, కథ వంటివి పాత పడవా, వాటిని మార్చరా అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories