మెగాస్టార్ ఫ్యామిలీపై మంచు విష్ణు సంచలన కామెంట్స్, చిరంజీవి-మోహన్ బాబు ఎవరు లెజండ్..?

First Published | Nov 2, 2024, 5:41 PM IST

మెగాస్టార్ చిరంజీవిపై.. మెగా ప్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు విష్ణు.. మనుషులను పెట్టి మరీ హింసిస్తున్నారంటూ పెద్ద దూమారమే రేపారు. ఇంతకీ విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ఎప్పుడు..? ఎక్కడ..? ఏ సందర్భంలోనివో తెలుసా..? 
 

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  మెగా - మంచు ఫ్యామిలీల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ తో పాటు.. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ వార్ కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఎదరుపడినప్పుడు ఎంత ఆప్యాయతగా ఉంటారో..ఏదైనా పోటీ వచ్చినప్పుడు మాత్రం అంత బద్దశత్రువులు లేరు అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు.  ఈ వివాదం ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో నడుస్తోంది. 

Also Read:  తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

మెగా మంచు ఫ్యామిలీ మధ్య వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్ కు మెగా ఫ్యామిలీనే కారణం అన్నట్టుగా మంచు విష్ణు కామెంట్స్ చేశారు. ఆఫీస్ ఒపెన్ చేసి మరీ.. మనుషులను ప్రత్యేకంగా పెట్టి తమపై ట్రోలింగ్ చేయిస్తున్నారని, తమ సినిమాలకు నెగెటీవ్ ప్రచారం చేసి ఆడకుండా చేస్తున్నారని అన్నారు మంచు విష్ణు.

 అయితే మంచు విష్ణు ఇప్పడు అన్న కామెంట్స్ కావు ఇవి. గతంలో తమ ఫ్యామిలీ ట్రోలింగ్స్ పై గట్టిగా స్పందించి.. కంప్లైయింట్ ఇచ్చి.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ను కూడా మూయించారు మంచు విష్ణు. ఆ టైమ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అవి ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుననాయి అంటే..  మంచు విష్ణు వ్యాఖ్యలు వైరల్ అవ్వడానికి కారణం ఒకటి ఉంది. 

Also Read: గౌతమ్ కు మళ్లీ వెన్నుపోటు పొడిచిన యష్మి,

Latest Videos


చిరంజీవి తాజాగా చేసిన కామెంట్స్ తో దీనికి లింక్ ఉంది. రీసెంట్ గా ఏఎన్నార్ అవార్డు అందుకున్న చిరంజీవి గతంలో జరిగిన వివాదాన్ని  పరోక్షంగా తెరపైకి తీసుకువచ్చారు. అప్పట్లో వజ్రోత్సవాలలో తనకు లెజండరీ అవార్డ్ ఇస్తుంటే కొందరు అడ్డుకున్నారని. దానిని నేను తీసుకోకుండా వదిలేశానని.. ఇక ఇప్పుడు ఏఎన్నార్ అవార్డ్ తో తను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను అంటూ కామెంట్స్ చేశారు. 

దాంతో మరోసారి మెగా -  మంచు వివాదాలు బయటకు వచ్చాయి. ఇక అసలు గతంలో  ఏం జరిగిందో చూసుకుంటే.. తెలుగు సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు చేసుకున్న సమయంలో వీరిమధ్య వివాదం ముదిరిపాకాన పడింది. చిరంజీవికి లెజండరీ అవార్డ్ ఇవ్వాలని ఇండస్ట్రీ అంతా నిర్ణయిస్తే.. తీవ్రంగా వ్యతిరేకించారు మోహన్ బాబు. 

Also Read:  విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్న దీపావళి వేడుకలు

నేను లెజండ్ కాదా..? ఇండస్ట్రీలో ఇంకా లెజండ్స్ లేరా అంటూ పెద్ద రచ్చ చేశారు. దాంతో ఈ విషయంలో చిన్నబుచ్చుకున్న చిరంజీవి. ఆ అవార్డ్ తీసుకోడానికి నిరాకరించారు. అది తీసుకునే రోజు ముందు ఉంది అంటూ కౌంటర్ గా పెద్ద పెద్ద వాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదం ఏదో ఒక రకంగా నడుస్తూనే ఉంది. మధ్య మధ్యలో ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది. 

ఈమధ్య కాలంలో 2021 మా ఎన్నికల టైమ్ లో మెగా వర్సెస్ మంచు అన్నట్టుగా మారిపోయింది. మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజును పోటీకి నిలబెట్టగా.. మంచు విష్ణు కూడా పోటీలో నిలబడ్డారు. ఇక నందమూరి ప్యామిలీ నుంచి బాలయ్య కూడా విష్ణుకుసపోర్ట్ చేశారు. ఇక మంచు విష్ణు గెలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు చిరంజీవి మీద ఆరోపణలు చేశాడు. 

Also Read:  అనుష్క నిర్లక్ష్యమే పెద్ద శాపంగా మారిందా..?

చిరంజీవి అంకుల్ నన్ను పోటీ నుండి తప్పుకోమన్నాడని మీడియా ఎదుట కామెంట్స్ చేశాడు.ఆ గొడవ చాలా కాలం నడిచింది. ఇక  అంతకు ముందు కూడా దాసరి నారాయణ రావు  చనిపోయినప్పుడు ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉండాలని అందరు కోరుకున్నారు. కాని మోహన్ బాబు మళ్లీ అడ్డుపడ్డారు.

తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలని కోరుకున్నారో ఏమో.. ప్రతీ విషయంలో తాను కలుగజేసుకున్నారు. చిరంజీవికి  అడ్డు పడ్డారు. దాంతో తాను ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానని.. పెద్దగా ఉండనంటూ చిరంజీవి స్టేట్మెంట్ ఇచ్చారు.

ఇటు మోహన్ బాబు కూడా ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవరు లేరని.. దాసరితోనే ఆ పెద్దరికంపోయిందని.. ఆయన తరువాత అంత సత్తా ఉన్ననాయకుడు ఇండస్ట్రీలో లేరు అన్నారు. అయితే ఆతరువాత వరుసగా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఇబ్బందులను చిరంజీవే ముందుండి పరిష్కరించారు. 

Also Read:  బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Chiranjeevi

గతంలో పొలిటికల్ గా పరిచయాలు, 24 క్రాఫ్ట్స్ లో అనుభవం ఉండటం వల్ల ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా.. చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయినా.. పంచాయితి కోసం దాసరి దగ్గరకు వెళ్ళేవారు. ఇక ఇప్పుడు అలాంటి క్వాలిటీ చిరంజీవిలోనే ఉంది.

కేంద్ర మంత్రిగా పనిచేశారు, పొలిటికల్ పరిచయాలు, టాలీవుడ్ మీద పట్టు ఉంది. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా.. చిరంజీవి దగ్గరకే తెలియకుండా వెళ్తున్నారు సినిమా వాళ్లు. ఆమధ్య  ఆర్ఆర్ఆర్ టికెట్ల విషయంలో  సమస్య వచ్చినప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని సెటిల్ చేశాడు.

దీంతో ఎవరు అనుకున్నా, కాదన్నా, ఆయన వద్దు అనుకున్నా మా దృష్టిలో చిరంజీవినే ఇండస్ట్రీ పెద్ద అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. దీనికితోడు కరోనా సమయంలో మెగాస్టార్‌ ముందుండి, ఇండస్ట్రీని కలుపుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు. ఇలా మెగా - మంచు వివాదం కొనసాగుతుంది. 

click me!