క చిత్ర కథ, మేం ఎంచుకున్న పాయింట్ ఇతర చిత్రాల్లో కానీ ఇంకెక్కడైనా మీకు దొరికినా, కాపీ చేసినట్లు అనిపించినా నేను సినిమాల నుంచి తప్పుకుంటా. క మూవీ మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినా నేను సినిమాలు చేయడం మానేస్తా అంటూ ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసినట్లుగానే కిరణ్ అబ్బవరం క చిత్రంతో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ని ఊహించడం ఎవ్వరి తరం కావడం లేదు. ఈ సక్సెస్ లో కిరణ్ అబ్బవరం తన భార్య రహస్యకి కూడా క్రెడిట్ ఇచ్చాడు. సక్సెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పెళ్లి చేసుకోండి సక్సెస్ వస్తుంది అని సరదాగా తెలిపాడు.