ప్రభాస్ ప్రైవేట్ మేటర్ లీక్, మొబైల్ స్క్రీన్ సేవర్ గా ఎవరి ఫోటో ఉంటుందో తెలుసా?

First Published | Nov 2, 2024, 5:15 PM IST

స్టార్ హీరో ప్రభాస్ కి సంబంధించిన ఓ ప్రైవేట్ మేటర్ వెలుగులోకి వచ్చింది. ఆయన మొబైల్ స్క్రీన్ సేవర్ గా ఒక ఫోటో పెట్టుకున్నాడట. ఆ ఫోటో ఎవరిదో చూద్దాం.. 
 

ప్రభాస్ చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అరుదుగా మీడియా కంట పడతారు. తన మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రమే బయటకు వస్తారు. అప్పుడప్పుడు తన సన్నిహితుల చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. అది కూడా సదరు మూవీ టీమ్ ప్రభాస్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. 


ఇక ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడు. ఏం చేస్తుంటాడు? అనే విషయాలు కూడా తెలిసింది తక్కువే. ప్రభాస్ లైఫ్ స్టైల్ పై ఎవరికీ అవగాహన ఉండదు. ఆయన ఫుడ్ లవర్ అని మాత్రం తెలుసు. రకరకాల నాన్ వెజ్ వంటకాలను తినేందుకు ఇష్టపడతారు. ప్రభాస్ వద్ద పెద్ద చెఫ్ టీమ్ ఉందట. వారు ప్రభాస్ కోరిన వంటకాలు రుచిగా చేసి వడ్డిస్తారట. 

తనతో పని చేసే నటులకు ప్రభాస్ విందు భోజనం తో సర్ప్రైజ్ ట్రీట్ ఇస్తాడు. పలువురు నటులు ప్రభాస్ ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పుకున్నారు. ప్రపంచంలోని అరుదైన, నోరూరించే వంటకాలతో ప్రభాస్ భోజనం పెడతారు. విరామం దొరికితే ప్రభాస్ విదేశాలకు వెళతారు. యూరప్ ఆయనకు ఇష్టమైన ప్రదేశం అని సమాచారం. అక్కడ ఆయన ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. 
 


ఇదిలా ఉంటే ప్రభాస్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ మేటర్ లీకైంది. అదేమిటంటే.. ప్రభాస్ మొబైల్ స్క్రీన్ సేవర్. ప్రభాస్ తన మొబైల్ స్క్రీన్ సేవర్ గా ఒక ఫోటో పెట్టుకున్నాడట. ఆ ఫోటో తన తల్లిదండ్రులది అట. తండ్రి సూర్యనారాయణరాజు, తల్లి శివ కుమారిలతో తాను దిగిన ఫోటోను ప్రభాస్ స్క్రీన్ సేవర్ గా సేవ్ చేసుకున్నాడట. తల్లిదండ్రులపై ప్రేమతో ఆయన ఇలా చేశాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 

మరోవైపు ప్రభాస్ పెళ్లి ఎప్పుడనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది.  ప్రభాస్ ఇటీవల 45వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ప్రభాస్ ఈ పాటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి కావాల్సింది. ప్రభాస్ తోటి హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సకాలంలో పెళ్లి చేసుకుని వారసులను కన్నారు. ప్రభాస్ మాత్రం ఆ ఊసు ఎత్తడం లేదు. 

ప్రభాస్ అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా? అనే సందేహం అందరిలో ఉంది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్, పెళ్లి దిశగా ఆలోచన చేస్తున్నారనిపించడం లేదు. గత ఏడాది ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ప్రభాస్. తాజాగా కల్కి తో వసూళ్ల వర్షం కురిపించాడు. కల్కి వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. 

ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల జాబితా పెద్దదే. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాల్సి ఉంది. మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ జరుపుకుంటుంది. సలార్ 2 తో పాటు దర్శకుడు హను రాఘవపూడితో ఒక చిత్రానికి ప్రభాస్ కమిట్ అయ్యాడు. కాబట్టి రానున్న మూడు నాలుగేళ్లలో ప్రభాస్ షెడ్యూల్ ఫుల్ బిజీ. మరి పెళ్లి చేసుకునే తీరిక ఎక్కడ?

తొమ్మిదో వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు ?

ప్రభాస్ గతంలో పెళ్లి పై స్పందించారు. దానికి సమయం రావాలని అన్నారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య గట్టిగా నిలదీస్తే... అమ్మాయి దొరకడం లేదు. సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని సిల్లీ సమాధానాలు చెప్పి తప్పుకున్నాడు. మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ వివాహం మీద గట్టి విశ్వాసంతో ఉన్నారు.

Latest Videos

click me!