చిరంజీవి, బాలయ్య, నాగార్జున, మోహన్ బాబు ఇలా అందరి కుటుంబాలతో బ్రహ్మికి మంచి సాన్నిహిత్యం ఉంది. హీరోలు కూడా బ్రహ్మానందంని సొంత ఫ్యామిలీ లాగే భావిస్తారు. మోహన్ బాబు ఫ్యామిలీతో బ్రహ్మానందంకి ఒక ఊహించని సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు బయట పెట్టారు. మంచు విష్ణు, అతని భార్య విరోనికా రెడ్డి పెళ్లి చాలా డ్రమాటిక్ గా జరిగింది.