సెట్లో నగ్మా బికినీ గొడవ..కృష్ణ చెప్పినా వినలేదు, షూటింగ్ ఆపేసి జంప్

First Published | Oct 16, 2024, 1:04 PM IST

'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నగ్మా. 

Nagma, bikini controversy, krishna, Bharata Simham


నగ్మా తెలుగు సినిమాలు మానేసి ఇంతకాలం అయినా ఆమెను తెలుగు వాళ్లు మర్చిపోలేరు. ఆమె కెరీర్ లో అలాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే అదే సమయంలో ఆమె పర్శనల్ లైఫ్ లోనూ, ప్రొఫిషనల్ లైఫ్ లోనూ వివాదాలు ఉన్నాయి.

నిర్మాతలను అప్పట్లో తన ఏటిట్యూడ్ తో వేపుకు తినేదని, ఇష్టం వచ్చినట్లు బిల్ లు పెట్టి నిర్మాతను ఇబ్బంది పెట్టేదని చెప్తారు. అయితే ఓ సంఘటన మాత్రం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ సినిమాకే ఆమె ట్విస్ట్ ఇచ్చి ముంబై వెళ్లిపోయింది. ఇంతకీ ఏమిటా సినిమా..ఎక్కవ వివాదం వచ్చిందో చూద్దాం. 

Nagma, bikini controversy, krishna, Bharata Simham


'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నగ్మా. ఆమె నటనకు, అందానికి యూత్‌ దాసోహమైపోయింది. దర్శకనిర్మాతలు తన ఇంటిముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలక్ట్‌ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ పోయింది.

తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ హీరోయిన్‌గా రాణించింది. మొదట హీరోయిన్‌గా చేసిన నగ్మా తర్వాత తల్లి, అత్త పాత్రల్లోనూ మెరిసింది. ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది. 


Nagma, bikini controversy, krishna, Bharata Simham


ఇక నగ్మా పేరు చెబితే తొంభైలలో  కుర్రాళ్లు ఊగిపోయేవారు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేది. తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, బాలయ్య బాబు, వెంకటేశ్​లతో కలిసి నటించి అందర్నీ మెప్పించింది.

తెలుగులో నగ్మా నటించిన కిల్లర్, అల్లరి అల్లుడు, ఘరాన మొగుడు, వారసుడు , మేజర్ చంద్రకాంత్, భాషా వంటి సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. అంతేకాదు నగ్మాను చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. ఆ విషయం ఆమెకీ తెలుసు. దాంతో ఆమె ఇష్టారాజ్యంలా ఉండేది.ముఖ్యంగా నగ్మా - సూపర్ స్టార్ కృష్ణతో ఓ మూవీ చేసే సమయంలో కాస్త దురుసుగా బిహేవ్ చేసిందని చెప్తారు. మూవీ షూటింగ్ సమయంలో డ్రస్ ల విషయంలో గొడవ అయిందట.

Nagma, bikini controversy, krishna, Bharata Simham


నగ్మా - కృష్ణ కాంబినేషన్​లో భరత సింహం  మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మొదట్లోనే నగ్మాకు ఆ చిత్ర నిర్మాతతో వాగ్వాదం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో రెండు పొట్టి నిక్కర్లు నగ్మా వేసుకోవాల్సిందట.

దాంతో ఆ పొట్టి నిక్కర్లు(బికినీలు)ను నగ్మానే తెచ్చుకోమని, బిల్ పెట్టుకోమని డైరెక్టర్ ప్రొడ్యూసర్​కు చెప్పారట. దీంతో ప్రొడ్యూసర్ కూడా నగ్మాకు ఈ విషయం చెప్పారట.ఆమె ఓకే చేసి తెచ్చుకుంటుంది. అయితే  నగ్మా రెండు బికినీలు తెచ్చుకుని వాటికి 60వేల రూపాయల బిల్లు పెట్టి షాక్ ఇచ్చిందిట. ఆ రోజుల్లో అరవై వేలు అంటే చాలా పెద్ద మొత్తం. 

Nagma, bikini controversy, krishna, Bharata Simham


దాంతో 60వేల బిల్లు చూసి షాకైన నిర్మాత ఆ డబ్బులను ఇవ్వనని చెప్పారట. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దగా అయ్యిందట. ఆ విషయం తెలుసుకున్న డైరెక్టర్ సాగర్ నేనే ఆ డబ్బులు చెల్లిస్తానని చెప్పినా నగ్మా వినసేదట. తనకు నిర్మాత ఇస్తేనే తీసుకుంటానని మొండికేసిందట. ఈ క్రమంలో  డైరెక్టర్ సాగర్ నగ్మాకు వార్నింగ్ కూడా ఇచ్చారట.  దాంతో  కోపం తెచ్చుకున్న నగ్మా షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి వెళ్లిపోయిందట. ఎంతమంది చెప్పినా కూడా షూటింగ్ కు రాలేదట.

Actress nagma


దాంతో సినిమా ఆగిపోయేలా ఉందని విషయం తెలుసుకున్న  హీరో కృష్ణ కూడా నగ్మాతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినా కూడా నగ్మా వినకపోవడంతో కథ మొత్తం మార్చేసి ఆమె పాత్రను మార్చేశారట. ఆ క్రమంలో  భరత సింహం సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. పైన చెప్పిన మొత్తం విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు సాగర్. ఈ మూవీ తర్వాత సాగర్ తన డైరెక్షన్​లో చేసే ఏ సినిమాలోనూ నగ్మను తీసుకోలేదని అన్నారు.

Latest Videos

click me!