తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తెలుగు సినిమాకు మొట్టమొదట గుర్తింపు తెచ్చిన నటుడు ఆయన. అదే విధంగా తెలుగు సినిమా చెన్నై నుంచి హైదరాబాద్ తరలి రావడంలో కీలక పాత్ర పోషించింది కూడా ఏఎన్నార్ అని చెప్పొచ్చు. వందలాది వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఏఎన్నార్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
అలాంటి ఘంటసాల బలరామయ్య మనవాడే ఇప్పటి సంగీత దర్శకుడు తమన్. ఈ విషయాన్ని ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రివీల్ చేశారు. బలరామయ్య కూడా తమన్ లాగే బాగా బొద్దుగా ఉండేవారు. ఆయన పోలికలే తమన్ కి వచ్చాయి అని సరదాగా నాగేశ్వర రావు తెలిపారు. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ శివకుమార్. బలరామయ్య కొడుకు శివకుమార్.. ఆయన కొడుకే తమన్. సినిమాల్లోకి వచ్చాక తన పేరుని ఎస్ తమన్ గా మార్చుకున్నారు. ఎస్ అంటే తన తండ్రి పేరు శివకుమార్ అని అర్థం. తమన్ పేరు వెనుక అంత హిస్టరీ ఉంది.
Thaman
తమన్ తన కెరీర్ లో అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ చిత్రాలకు సంగీతం అందించారు. రగడ, గ్రీకువీరుడు, తడాఖా, అఖిల్ లాంటి చిత్రాలకు తమన్ సంగీతం అందించారు. అదన్నమాట తమన్ ఫ్యామిలీకి ఏఎన్నార్ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్.