మెగా ఫ్యామిలీతో వివాదంపై మంచు విష్ణు క్రేజీ కామెంట్.. అప్పుడు అలా చేసి ఉండకూడదు, నేను పూర్తిగా మారిపోయా!

Published : Mar 20, 2025, 09:58 AM IST

Manchu-Mega Family Controversy: మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య వివాదాలున్నాయనే పుకార్లు వినిపిస్తుంటాయి. తాజాగా దీనిపై స్పందించారు మంచు విష్ణు. అప్పుడు అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. 

PREV
17
మెగా ఫ్యామిలీతో వివాదంపై మంచు విష్ణు క్రేజీ కామెంట్.. అప్పుడు అలా చేసి ఉండకూడదు, నేను పూర్తిగా మారిపోయా!
chiranjeevi, mohan babu, manchu vishnu

Manchu-Mega Family Controversy: మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య వివాదాలు ఉన్నాయనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. మోహన్‌ బాబుకి, చిరంజీవికి పడదు అంటుంటారు. కానీ కొన్ని ఈవెంట్లలో ఈ ఇద్దరు కలిసిపోతుంటారు. హగ్‌ చేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. అయినా మెగా, మంచు ఫ్యామిలీల మధ్య వివాదం అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికల సమయంలో వీరి మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. నువ్వా నేనా అనే స్థితికి వెళ్లింది. అటు చిరంజీవి, ఇటు మోహన్‌బాబు, మంచు విష్ణు ఘాటుగా కామెంట్లు చేసుకున్నారు. 
 

27

దీంతో మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీలకు పడదు అనేది బహిరంగంగానే స్పష్టమైంది. కానీ మధ్యలో చిరంజీవిని వెళ్లి కలిశారు మోహన్‌బాబు, మంచు విష్ణు. తమ సినిమాల విషయంలో కలవడం జరిగింది. కానీ ఆ రూమర్స్ మాత్రం పోవడం లేదు.

ఇద్దరికి పడదు అనేది ఇంకా అడపాదడపా వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై మంచు విష్ణు స్పందించారు. క్రేజీ కామెంట్‌ చేశారు. అంతేకాదు తాను కంప్లీట్‌గా మారిపోయినట్టు తెలిపారు మంచు విష్ణు. 
 

37

`మా` ఎన్నికలకు సంబంధించిన వివాదం గురించి చెబుతూ, అది గతం గతహా అని, అందరం దాన్ని మర్చిపోయామని తెలిపారు. ప్రకాష్‌ రాజ్‌ కూడా టచ్‌లోనే ఉన్నారని తెలిపారు.

అప్పటి వరకు అది హీట్‌ మూమెంట్‌ కానీ ఆ తర్వాత తాము అంతా ఒకే ఫ్యామిలీ అని తెలిపారు.ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీతో వివాదంపై రియాక్ట్ అయ్యారు. తమ రెండు ఫ్యామిలీ మధ్య గొడవలు అనేది మీడియా సృష్టినే అని తెలిపారు.

47
manchu vishnu

మీకు టీఆర్‌పీ రేటింగ్‌ కావాల్సినప్పుడు ఇలాంటి వివాదాలను తెరపైకి తీసుకొస్తారని అన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తాము టెక్ట్స్ మెసేజెస్‌లో టచ్‌లోనే ఉన్నామని తెలిపారు.  

తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవని చెప్పారు మంచు విష్ణు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయిన్నట్టు చెప్పారు.

57
manchu vishnu

`ఢీ` అప్పుడు విష్ణు వేరు, ఇప్పుడు `కన్నప్ప` చేసిన విష్ణు వేరని తెలిపారు. ఒక వ్యక్తిగా నేను మారిపోయాను. అప్పుడు అలా చేయకూడదు అనిపించింది. అలా మాట్లాడకూడదు అనిపించింది.

కానీ ఏది రిగ్రెట్‌ లేదు. ఆ సమయానికి అది కరెక్ట్, ఆ సందర్భాన్ని బట్టి అది చేయాల్సి వచ్చింది. అంతేకాని ఆ నెగటివిటీని ఇప్పుడు క్యారీ చేయాలనుకోవడం లేదు. 

read  more: అల్లు అర్జున్‌ వివాదంలో ఇండస్ట్రీ మౌనానికి కారణమిదే.. మంచు విష్ణు బయటపెట్టిన నిజాలు

67
manchu vishnu

12 జ్యోతిర్లింగాలు తిరిగే యాత్ర మొదలు పెట్టిన తర్వాత ఒక మనిషిగా నేను మారిపోయాను. నెగటివిటీ వద్దు అనే దశకు వెళ్లిపోయాను అని చెప్పారు. ఈ సందర్భంగా తనలో ఉన్న నెగటివిటీ గురించి చెబుతూ, మీరు నాకు నచ్చకపోతే మీతో మాట్లాడలేను.

నేను నా జోన్‌లోకి వెళ్లిపోతాను. మాట్లాడుకుని చాలా సమస్యలు పరిష్కరించుకోవాలని అంతా చెబుతుంటారు. కానీ ఎందుకో నేను ఆ జోన్‌లోకి వెళ్లిపోతాను అని తెలిపారు మంచు విష్ణు. 
 

77
Kannappa Teaser

ప్రస్తుతం ఆయన `కన్నప్ప` చిత్రంలో నటిస్తున్నారు. తండ్రి మోహన్‌బాబుతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం వంటి భారీ కాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఏప్రిల్‌ 25న సినిమా విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో మంచు విష్ణు వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా అనేక ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. అందులో భాగంగా మెగా ఫ్యామిలీతో వివాదంపై రియాక్ట్ అయ్యారు. తనదైన స్టయిల్‌లో క్రేజీగా స్పందించారు. 

read  more: మెగాస్టార్‌ స్థానం కోసం పోటీపడ్డ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా? బాలయ్య, వెంకీ, నాగ్‌ అసలే కాదు.. అదే వాళ్ల మైనస్‌

also read: `బిగ్‌ బాస్‌ తెలుగు 9` కొత్త హోస్ట్ ఎవరో తెలుసా? విజయ్‌ దేవరకొండ కాదు.. అదిరిపోయే ట్విస్ట్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories