Bigg Boss Telugu 9 update, vijay deverakonda
Bigg Boss Telugu 9 update : `బిగ్ బాస్ తెలుగు 9` ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. దీనికితోడు `బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. షో ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది?
`బిగ్ బాస్` హోస్ట్ మారుతున్నారనే మరో వార్త ప్రధానంగా వైరల్‌గా మారాయి. మరి వీటిలో నిజం ఏంటి? షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నాగార్జున హోస్ట్ గా నిజంగానే మారుతున్నారా? మారితే కొత్త హోస్ట్ ఎవరు? ఇందులో ట్విస్ట్ ఏంటనేది చూస్తే.
Bigg Boss Telugu 9 update
`బిగ్ బాస్ తెలుగు 8` షో గత డిసెంబర్‌లో అయిపోయింది. అయితే ఈ సారి త్వరగానే ప్రారంభం కాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. మేలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వైరల్‌గా మారాయి.
కానీ నిజం ఏంటంటే ఈ షో రెగ్యూలర్ టైమ్‌కే ప్రారంభం కానుందట. అయితే రెగ్యూలర్‌గా సెప్టెంబర్‌లో ప్రారంభిస్తున్నారు. కానీ ఈ సారి ఆగస్ట్ లోనే ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారట. దీనిపై కసరత్తులు జరుగుతున్నాయి.
nagarjuna akkineni
ఇంకోవైపు హోస్ట్ గా గత ఆరు సీజన్లుగా నాగార్జున చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యాతగా కొన్ని సీజన్లలో సక్సెస్ అయ్యారు? కానీ మరికొన్ని సీజన్లలో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తనని తాను మార్చుకుంటూ, బెటర్ చేసుకుంటూ వస్తున్నారు.
ఆరు సీజన్లని తనదైన స్టయిల్‌లో హోస్ట్ గా చేస్తూ మెప్పిస్తున్నారు. కానీ గత సీజన్లలో ఆయన హోస్టింగ్ అంతగా ఆకట్టుకునేలా లేదనే టాక్ వినిపించింది. కొందరికి బయాస్‌గా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి.
Vijay Deverakonda, Nagarjuna, Nani
ఈ నేపథ్యంలో `బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి హోస్ట్ ని మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్టింగ్ చేయబోతున్నారనే చర్చ స్టార్ట్ అయ్యింది.
మరి ఇది నిజమేనా? వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా విజయ్ దేవరకొండ హోస్టింగ్ చేస్తాడా? అనేది ప్రశ్న. ఈ క్రమంలో అదిరిపోయే ట్విస్ట్ బయటకు వచ్చింది. కొత్త హోస్ట్ ఎవరో తేలిపోయింది.