మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు, మంచువారింట మరోసారి మంటలు, అసలేం జరిగింది.

Published : Apr 09, 2025, 01:19 PM IST

గత కొద్ది కాలంగా మంచు మోహన్ బాబు ఇంట్లో గోడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య జల్ పల్లి ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్తలు, మీడియా వారిపై మోహన్ బాబు దాడి, మనోజ్ పై పోలీస్ కంప్లైయింట్, ఆడియో సందేశం రిలీజ్ చేయడం..ఇలా రకరాల వివాదాల తరువాత, ఈమధ్య కాస్త గోడవలు శాంతించినట్టు కనిపించింది. మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు జరిగినా అవి పెద్దవి అవ్వలేదు. అయితే తాజాగా మరోసారి పరిస్థితి చేయిదాటిపోయినట్టు కనిపిస్తోంది. మంచు వారింట మరోసారి మంటలు రేపిన విషయంఏంటి? 

PREV
14
మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు, మంచువారింట మరోసారి మంటలు, అసలేం జరిగింది.

టాలీవుడ్ స్టార్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు మరోసరి తారాస్థాయికి చేరాయి. మనోజ్, విష్ణు మధ్య జరుగుతున్న వార్ లో.. మోహన్ బాబు విష్ణు వైపు ఉండటంతో, మనోజ్ ఒంటరిపోరాటం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన గొడవల తరువాత వివాదం కాస్త సర్ధుమణిగినట్టు కనిపించినా, మరోసారి మనోజ్ తండ్రితో మాట్లాడలంటూ మోహన్‌ బాబు ఇంటి దగ్గరకు చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. 

Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీ కోసం కళ్ళు తిరిగే బడ్జెట్, గ్రాఫిక్స్ కే 250 కోట్లు, అసలు ఎంతో తెలుసా?

24

మంగళవారం చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఉద్రిక్తలకు దారి తీశాయి. దాంతో ఈరోజు (బుధవారం) ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు.

ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోసారి అక్కడ గొడవలు జరిగే పరిస్థితి ఉందని తెలుసుకున్న అధికారులు.. మోహన్ బాబు  ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోహన్‌బాబు ఇంటికి 2 కిలో మీటర్ల నుంచి ఆంక్షలు విధించారు.

Also Read: సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా

 

34

మంచు ఫ్యామిలీలో తాజాగా మరో హైడ్రామా చోటు చేసుకుంది. మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు బర్త్ డే కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు, అది అవకాశంగా తీసుకున్ని తన కార్లు ఎత్తుకెళ్లారంటూ మనోజ్ ఆరోపించారు.

తన ఇంట్లో ఉండాల్సి కార్లు తన సోదరుడు విష్ణు ఇంట్లో ఉన్నాయని ఆయన అన్నారు.   విష్ణు 150 మందితో తన ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశారని.. తమ కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారని.. తన కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని.. జల్ పల్లిలో తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని మనోజ్  అన్నారు. 

Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?

44
Mohan Babu, Manoj and Vishnu

కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. రికవీరికి వెళ్లినప్పుడు దానిని మాదాపూర్ పంపించినట్లు మనోజ్ మీడియాతో వెల్లడించారు. పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా అప్రపత్తం అయ్యారు. మంచు వారి ఇంట్ల ఆస్తి గొడవలు చాలా కాలంగా జరుగుతున్నాయి.  కొన్నేళ్ళుగా ఇంటికే పరిమితం అయిన గొడవలు.. పోయిన ఏడాది వీధిన పడ్డాయి. ఈక్రమంలో మనోజ్ ఒక వైపు.. మంచు ఫ్యామిలీ ఒక వైపు ఉన్నట్టు తెలుస్తోంది. మంచు లక్ష్మీ వీరిలో ఎవరికి సపోర్ట్ గా ఉన్నారు అనేది మాత్రం వెల్లడించలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories