ఆ చిత్రం ఆధారంగా మెహర్ రమేష్, తోట ప్రసాద్ స్క్రిప్ట్ పూర్తి చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఫస్ట్ టైం అనుష్క శెట్టిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రానికి సీతామహాలక్ష్మీ ఎఫ్ 19 అనే టైటిల్ అనుకున్నారట. అనుష్క హీరోయిన్ గా సెట్ కాలేదు. చివరికి మరో హీరోయిన్ ని అనుకున్నారు. 2004 డిసెంబర్ మొదటి వారంలో పూరి జగన్నాధ్ నిర్మాతగా, మెహర్ రమేష్ దర్శకుడిగా, సాయిరాం శంకర్ హీరోగా ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. బ్యాంకాక్ బీచ్ లో షూటింగ్ చేద్దామని అనుకున్నారు.