ఇందులో మనోజ్ చెబుతూ, `పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ వేడుకల రోజున నీ పక్కన లేనందుకు చాలా మిస్ అవుతున్నా. నీ చుట్టూ ఉండటానికి ఆతృతగా ఉన్నా నాన్నా. అన్నిరకాలుగా నిన్ను ప్రేమిస్తున్నా` అని తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భం చిన్ననాటి ఫోటో ఒకటి పంచుకున్నారు మనోజ్.
అంతేకాదు నాన్న మీద వచ్చే సాంగ్‌ని జోడించి మోహన్‌బాబు సినిమాలోని సీన్లతో వీడియోచేశాడు. ఇది ఆద్యంతం ఎమోషనల్‌గా ఉంది. హృదయాన్ని బరువెక్కించేలా ఉంది. తండ్రి మోహన్‌బాబుపై తనకున్న ప్రేమకిది నిదర్శనంగా నిలుస్తుంది.
దీంతో ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది మంచు ఫ్యామిలీలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.