అమీర్ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి
అమీర్ ఖాన్ మొదటి వివాహం 1986లో రీనా దత్తాతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కొడుకు జునైద్ ఖాన్, కుమార్తె ఇరా ఖాన్ ఉన్నారు. వారు 2002లో విడాకులు తీసుకున్నారు. అమీర్ రెండో వివాహం 2005లో కిరణ్ రావుతో జరిగింది. వీరికి అజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అతను 2021లో కిరణ్ నుండి విడిపోయాడు. అయితే, వారు తమ కొడుకు కోసం తల్లిదండ్రులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.