బాలయ్య మూవీ ఫ్లాప్ కి తాను కారణం కావడంతో ఫీలైన వెంకటేష్, టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ జరగని వివాదం

Published : Sep 18, 2025, 01:08 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన ఓ చిత్రం డిజాస్టర్ కావడానికి విక్టరీ వెంకటేష్ కారణం అయ్యారు. దీనివల్ల ఫీలైన వెంకటేష్ ఎలా రియాక్ట్ అయ్యారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Balakrishna and Venkatesh

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మధ్య కొన్ని దశాబ్దాల క్రితం ఒక వివాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన అది. ఆ సంఘటనలో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. ఈ వివాదం వల్ల బాలయ్య చిత్రానికి చాలా నష్టం జరిగింది. తనవల్ల ఆ సంఘటన జరగడంతో వెంకటేష్ బాగా ఫీల్ అయ్యారు. అసలేం జరిగింది, ఆ టైంలో బాలయ్య, వెంకటేష్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

25
ధ్రువ నక్షత్రం Vs అశోక చక్రవర్తి

1989లో జూన్ 26న విక్టరీ వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం చిత్రం విడుదలైంది. వై నాగేశ్వర రావు ఈ చిత్రానికి దర్శకుడు. రజని హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి మూడు రోజుల వ్యవధిలో బాలయ్య నటించిన అశోక చక్రవర్తి చిత్రం జూన్ 29న విడుదలయింది. ఆశ్చర్యకరంగా ఈ రెండు చిత్రాల స్టోరీ ఒక్కటే. ధ్రువ నక్షత్రం చిత్రం ముందుగా రిలీజ్ కావడంతో ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఆ ఎఫెక్ట్ బాలయ్య మూవీ పై పడింది.

35
రీమేక్ గా బాలయ్య చిత్రం

ధ్రువ నక్షత్రం చిత్రం చూసిన ప్రేక్షకులు అశోక చక్రవర్తి చూసి ఆశ్చర్యపోయారు. వెంకటేష్ సినిమా కథతో బాలయ్య మూవీ చేశాడు ఏంటి అని షాక్ అయ్యారు. దీనితో అశోక చక్రవర్తి చిత్రానికి నెగిటివ్ టాక్ ఎక్కువై మూవీ డిజాస్టర్ గా నిలిచింది. వెంకటేష్ ధ్రువ నక్షత్రం చిత్రం మాత్రం మంచి వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాలయ్య నటించిన అశోక చక్రవర్తి చిత్రాన్ని.. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మోహన్ లాల్ ఆర్యన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు.

45
వివాదం చెలరేగింది

ఆర్యన్ మూవీ రీమేక్ హక్కులని అశోక చక్రవర్తి టీమ్ 3 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ధ్రువ నక్షత్రం టీమ్ మాత్రం ఆర్యన్ కథని కాపీ చేసి చిన్న చిన్న మార్పులతో మూవీ చేసేశారు. దీనివల్ల అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. అశోక చక్రవర్తి నిర్మాతలు ధ్రువ నక్షత్రం టీం పై ఆరోపణలు కురిపించారు. తాము కొనుగోలు చేసిన మూవీ కథని ఎలా కాపీ చేస్తారు అని నిలదీశారు. వివాదం ఎక్కువ అవుతుండడంతో వెంకటేష్ ఇన్వాల్వ్ అయ్యారు.

55
ఉహించని ట్విస్ట్ అదే

జరిగిన సంఘటనకి నేను చాలా ఫీల్ అవుతున్నాను. ధ్రువ నక్షత్రం కథ బాలయ్య సినిమా కథలా ఉందనే విషయం నాకు రిలీజ్ అయ్యే వరకు అసలు తెలియదు. ముందే తెలిసి ఉంటే ఈ చిత్రాన్ని ఆపేసేవాడిని అని వివరణ ఇచ్చారు. బాలయ్య మాత్రం వివాదం ఎక్కువ కాకూడదని సైలెంట్ గా ఉండిపోయారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు చిత్రాలకు రచయితలు ఒక్కరే. వాళ్లే పరుచూరి బ్రదర్స్. ఈ రెండు చిత్రాల కథలు రాసేటప్పుడు వీళ్ళకి కనీసం కథ ఒకేలా ఉందని అనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇలాంటి సంఘటన టాలీవుడ్ జరగడం అదే తొలిసారి.

Read more Photos on
click me!

Recommended Stories