ప్రభాస్ సినిమాతో అభిషేక్ బచ్చన్ టాలీవుడ్ ఎంట్రీ? నిజమెంత?

Published : Sep 18, 2025, 01:53 PM IST

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తొలిసారి తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించనున్నారని హిందీ మీడియాలో చర్చ సాగుతోంది. 

PREV
14
అభిషేక్ బచ్చన్ టాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోందా? ప్రభాస్ సినిమా ద్వారా ఆయన తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నారా? ఇఫ్పటికే బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలంతా సౌత్ బాట పడుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే అమితాబచ్చన్, సంజయ్ దత్త్, సునిల్ శెట్టి, అజయ్ దేవగణ్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్స్ టాలీవుడ్ లో సినిమాలు చేశారు, చేస్తున్నారు. ఈ బాటలోనే అభిషేక్ బచ్చన్ కూడా నడవబోతున్నట్టు తెలుస్తోంది.

24
ప్రభాస్ సినిమాలో

ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం "ఫౌజీ" అనే వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది.ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై అభిషేక్ వెంటనే సానుకూలంగా స్పందించినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

34
అమితాబ్ చొరవతో

అభిషేక్ బచ్చన్ ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో నటించలేదు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన నటిస్తే, అది ఆయనకు తెలుగు సినిమా రంగంలో తొలి చిత్రం అవుతుంది. ఇక ఇప్పటికే అభిషేక్ తండ్రి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ “కల్కి 2898 ఎ.డి” వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ప్రభాస్‌, అమితాబ్ మధ్య ఉన్న సత్సంబంధం వల్లే ఈ ఆఫర్ ను అభిషేక్ ఒకే చేశారని తెలుస్తోంది.

44
త్వరలో అధికారిక ప్రకటన

ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హను రాఘవపూడి గతంలో “సీతారామం” వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్‌కి ఇది ఒక కొత్త ప్రయోగంగా మారే అవకాశముంది.ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర బృందం వెల్లడించనుంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories