సముద్రఖని కోలీవుడ్ నటుడైనా ఇప్పుడు తెలుగు యాక్టర్‌గా మారిపోయారు. వరుసగా తెలుగు సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఇటీవల `ది రాజా సాబ్`లో మెరిసిన ఆయన ఇప్పుడు ప్రధాన పాత్రలో `కొక్కొరోకో` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యంగ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మనస్విని బాల బొమ్మల కూడా నటిస్తుండటం ఓ విశేషమైతే, దీనికి రమేష్ వర్మ దర్శకుడు కావడం మరో విశేషం. ఆయన గతంలో `ఒక ఊరిలో`, `రైడ్`, `వీర`, `అబ్బాయితో అమ్మాయి`, `రాక్షసుడు`, `ఖిలాడీ` వంటి చిత్రాలను రూపొందించారు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ మూవీతో ఆయన ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. `కొక్కొరోకో` అనే మూవీని రూపొందిస్తున్నారు. అయితే దీనికి ఆయన దర్శకుడు కాదు, నిర్మాత కావడం విశేషం. కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా నిర్మాతగా మారి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. స్పెషల్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. సంప్రదాయ వాతావరణంతో రూపొందిన ఆ పోస్టర్‌పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. `కొక్కొరోకో` త్వరలో థియేటర్లలో` అనే సందేశం ఆకట్టుకుంది.