9 స్క్రీన్లతో మహేష్ బాబు భారీ థియేటర్ , బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ ప్రత్యేకతలేంటో తెలుసా?

Published : Jan 17, 2026, 09:07 PM IST

బెంగళూరులో ఎంతో హిస్టరీ ఉన్న మెజెస్టిక్ సర్కిల్‌లో ఉన్న కపాలి థియేటర్ స్థానంలో ఇప్పుడు ఒక పెద్ద మాల్ నిర్మించారు. అక్కడ ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ వెలిసింది. అది ఎవరిదో కాదు.. సూపర్ స్టార్  మహేష్ బాబుది. ఆ మల్టీప్లెక్స్ లో ప్రత్యేకతలు ఏంటో తెలుసా?  

PREV
16
బెంగళూరులో మహేష్ బాబు మల్టీప్లెక్స్

బెంగళూరులోని పాత కపాలి టాకీస్ స్థానంలో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ వెలిసింది. తెలుగు స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు యాజమాన్యంలోని ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్‌గా ప్రారంభమైంది.బెంగళూరులో   హిస్టరీ కలిగి ఉన్న మెజెస్టిక్ సర్కిల్‌లో  కపాలి థియేటర్ స్థానంలో ఈ అతిపెద్ద మాల్ నిర్మించారు. ఈ  మల్టీప్లెక్స్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. 

26
7 స్క్రీన్లు బార్కో లేజర్ ప్రొజెక్షన్‌ టెక్నాలజీ

ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం తొమ్మిది స్క్రీన్లు ఉన్నాయి.ఇక్కడున్న మొత్తం 9 స్క్రీన్లలో 7 స్క్రీన్లు బార్కో లేజర్ ప్రొజెక్షన్‌ను కలిగి ఉన్నాయి. కలర్ క్వాలిటీ, స్క్రీన్ క్లారిటీ  కోసం ఈ ప్రొజెక్షన్ టెక్నాలజీని వాడతారు. ఇది మహేష్ బాబు సినిమాస్‌లో ఉండటం విశేషం.

36
6వ స్క్రీన్ చాలా స్పెషల్

ఈ ఏఎంబీ సినిమాస్‌లోని 6వ స్క్రీన్ చాలా స్పెషల్. ఇది దక్షిణ భారతదేశంలోనే మొదటి డాల్బీ సినిమా స్క్రీన్. క్రిస్టీ 6K డాల్బీ విజన్ ప్రొజెక్టర్, ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్‌తో పాటు 'ఎం-లాంజ్' కూడా ఉంది.

46
బెంగళూరులో హైదరాబాద్ బిర్యానీ

ఈ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసేవాళ్ల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన రుచికరమైన ఆహారం, పానీయాల ఏర్పాట్లు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, ఇతర స్నాక్స్ ఇక్కడ దొరుకుతాయి.

56
మొదటి రోజు 20 షోలు

జనవరి 16న సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. థియేటర్‌లో పండగ వాతావరణం నెలకొంది. మొదటి రోజు 20 షోలు ప్రదర్శించగా, అందులో 6 షోలు 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రానికి కేటాయించారు. ఒక రకంగా చిరంజీవి సినిమాతో ఈ మల్టీప్లెక్స్‌ స్టార్ట్ అయ్యింది. 

66
తెలుగు సినిమాలదే పై చేయి..

కన్నడ చిత్రాలు 'మార్క్', 'సూర్య'కు, మూడు తమిళ సినిమాలకు ఒక్కో షో ఇచ్చారు. మిగిలిన వాటిలో తెలుగు సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్  ఇచ్చారు. టాలీవుడ్ సినిమాలకు చాలా షోలు దక్కాయి.

Read more Photos on
click me!

Recommended Stories