ఇల్లు ఇల్లాలు పిల్లలు టీవీ సీరియల్ లో జనవరి 16 ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. అమూల్య నిశ్చితార్థానికి ముందు అపశకునం జరిగింది. ఆ వివారాలు ఈ కథనంలో తెలుసుకోండి.
నర్మద, సాగర్ మధ్య రొమాంటిక్ సీన్స్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జనవరి 16 ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అందరూ నిశ్చితార్థ ఏర్పాట్లలో ఉంటారు. నిశ్చితార్థం సవ్యంగా జరగాలని వేదవతి పూజ గదిలో దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ సమయంలో దీపాలు ఆరిపోయి అపశకునం జరుగుతుంది.
24
ఇంట్లో వస్తువులు దొంగిలించడానికి కామాక్షి
స్కెచ్ దీనితో వేదవతి ఈ టైంలో అపశకునం జరిగింది ఏంటి అని కంగారు పడుతుంది. ఇంతలో కామాక్షి, ఆమె భర్త, తిరుపతి మధ్య ఫన్నీ సీన్స్ జరుగుతాయి. అమ్మగారి ఇంట్లో దొరికిన వస్తువులు తీసుకువెళ్ళడానికి కామాక్షి పెద్ద సూట్కేస్ తీసుకురమ్మని భర్తకి చెబుతుంది. కానీ అతడు చిన్న సూట్కేస్ తీసుకురావడంతో కోపం వ్యక్తం చేస్తుంది.
34
శ్రీవల్లి తల్లిదండ్రుల కుట్ర
ఇంతలో అబ్బాయి వాళ్ళు కారులో నిశ్చితార్థానికి ఎంట్రీ ఇస్తారు. దీనితో రామరాజు కుటుంబ సభ్యులు అంతా గేటు వద్ద ఎదురుచూసి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. ఇంటిలోకి స్వాగతం పలుకుతారు. అందరూ నిశ్చితార్థానికి కూర్చుంటారు. తమ వద్ద ఉన్న అమూల్య ఫోటోలు.. అబ్బాయి వాళ్ళ కంటపడేలా చేయాలని, నిశ్చితార్థం చెడగొట్టాలి అని శ్రీవల్లి, ఆమె తల్లిదండ్రులు కుట్ర మొదలు పెడతారు.
రామరాజు తన కుటుంబ సభ్యులని అబ్బాయి వాళ్ళకి పరిచయం చేస్తారు. తన భార్య వేదవతి మాత్రం బయటే ఉండిపోయి నిశ్చితార్థం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆమెని తీసుకురమ్మని రామరాజు కోడళ్ళకు చెబుతాడు. దీనితో నర్మద, ప్రేమ ఇద్దరూ అత్తగారు వేదవతి దగ్గరకు వెళతారు. ఆమె దిగులుగా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతారు. కూతురి నిశ్చితార్థం, పెళ్లి విషయంలో టెన్షన్ పడుతున్నట్లు వేదవతి చెబుతుంది. ఆమెకి నర్మద, ప్రేమ ధైర్యం చెప్పి లోపలి తీసుకువస్తారు. ప్రేమ మాత్రం తన భర్త ధీరజ్ పై అలిగి రూమ్ లో ఒంటరిగా ఉండిపోతుంది. ఆమెని బుజ్జగించడానికి ధీరజ్ వెళ్లడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.