ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...జానకి గోరింటాకు రుబ్బుతున్నప్పుడు జెస్సి అక్కడికి వస్తుంది. అదే సమయంలో జ్ఞానాంబ వెనకాతల నుంచి వాళ్ళిద్దరి మాటలు వింటుంది. అప్పుడు జెస్సి జానకి తో, అక్క నేను రేపు పూజ లో పాల్గొంటాను, ఆంటీ ఒప్పుకుంటారా అని అనగా, రేపు నువ్వే పూజ చెయ్యాలి నేను అత్తయ్య గారితో మాట్లాడడాను కూడా! కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి జెస్సీ. రేపు వచ్చిన వాళ్ళందరి కళ్ళు నీ మీద ఉంటాయి, నువ్వు చేసే ప్రతి పని వాళ్ళ దృష్టికి చేరుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు అత్తయ్య గారిని ఆంటీ అని పిలవకూడదు.