ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ మధ్య వాడి వాడి చర్చనడిచింది . ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా 10 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆట తీరు బాగాలేదని నాగార్జున అర్జున్ కళ్యాణ్, కీర్తిలను నేరుగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరితో పాటు ఇనయ, రేవంత్, సుదీప, శ్రీహాన్, గీతూ, సూర్య, రాజ్, ఆరోహి రావు నామినేట్ అయ్యారు.