ఆవిడకి నయమైనా అవ్వకపోయినా అది మీ వల్లే అవుతుంది అని అనగా, దానికి మా భార్య ఉన్నది కదా నా భార్య రాద అని చూసుకుంటుంది అని అంటాడు మాధవ్.దానికి రుక్మిణి,ఆదిత్య ఇద్దరు చిరాకుగా ముఖం పెడతారు. ఇంతలో డాక్టర్ గారు ఏదో మందులు చెబుతున్నట్టున్నారు వెళ్ళు అని మాధవ్ ని అంటాడు ఆదిత్య. అప్పుడు డాక్టర్,ఈరోజు డిశ్చార్జ్ ఇస్తున్నాము,ఈవిడని తీసుకువెళ్లిపోవచ్చు అని చెప్తారు.ఆ తర్వాత సీన్లో సత్య చీకట్లో ఆలోచించుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆదిత్య, దేవుడమ్మ అక్కడికి వస్తారు.