జానకి దిలీప్ వాళ్ళ అమ్మకి దిలీప్, వెన్నెల ప్రేమించుకుంటున్న విషయాన్ని చెప్పద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మల్లిక వినడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక జానకి వచ్చి మల్లికను చూడడంతో మీ ఇల్లు బాగుంది అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్ఞానాంబ కట్నం ఎంత అడిగిన ఇద్దాం అని చెప్పగా జానకి అసలు కట్నమే వద్దంటున్నారు అని ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడింది అని మాట మార్చి చెప్తుంది. దాంతో సంతోషపడిన జ్ఞానాంబ తన భర్త, అత్తయ్యతో చెప్పి మీకు కబురు పెడతాను అని చెప్పి వెళ్లిపోతుంది.