Gangubai Kathiawadi Movie Review in Telugu: గంగూబాయ్ గా ఆలియా మెప్పించిందా...? సినిమా ఎలా ఉందంటే..?

Published : Feb 25, 2022, 01:40 PM ISTUpdated : Feb 25, 2022, 01:41 PM IST

బాలీవుడ్‌ యంగ్‌ స్టార్  ఆలియా నటించిన ప్రయోగాత్మక  సినిమా గంగూబాయ్ కతియావాడి.ఫేమస్ రైటర్  హుస్సేన్‌ జైదీ రాసిన మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై అనే నవల  ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈరోజు(25 ఫిబ్రవరి) రిలీజ్ అయిన ఈసినిమా ఎలా ఉంది.. ఆలియా పెర్ఫామెన్స్ కు ఎన్నిమార్కులు పడ్డాయి చూద్దాం.

PREV
110
Gangubai Kathiawadi Movie Review in Telugu: గంగూబాయ్ గా ఆలియా మెప్పించిందా...?  సినిమా ఎలా ఉందంటే..?

గంగూబాయ్ కతియావాడి సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించారు. ఈసినిమాను  డైరెక్టర్ చేయడంతో పాటు పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ జయంతీలాల్‌ గడతో కలిసి నిర్మించారు. ఈ సినిమాలో గంగూ భాయ్ గా బాలీవుడ్ స్టార్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ నటించింది. గంగూభాయి గా ఆలియాను పోష్టర్స్ లో చూసిన ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశారు.

210

ఇదివరకే రిలీజైన ట్రైలర్‌, సినిమాపై చుట్టుకున్న వివాదాలు ఆలియా సినిమాకు హైప్‌ తీసుకొచ్చాయి.అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయ్‌ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టు కోర్టుకు వెళ్లారు. సినిమా రిలీజ్ కూడా ఆపేయాలని ప్రయత్నించినా.. సినిమా విడుదలపై స్టే విధించేందుకు కోర్డ్ నిరాకరించింది. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది.

310

ఎట్టకేలకు ఈరోజు( ఫిబ్రవరి 25) గంగూబాయ్ కతియావాడి రిలీజ్ అయ్యంది. మరి ఈసినిమా ఎలా ఉంది..? గంగూబాయిగా ఆలియా ఎన్ని మార్కులు సాధించింది. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి   సినిమాను ఎలా డ్రైవ్ చేశారు. ఇప్పటికే ఎన్నో వివాదాలు చెలరేగిన ఈ సినిమాకు.. రిలీజ్ తరువాత ఏమైనా వివాదాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయా..?

410

ముందుగా కథ విషయానికి వస్తే.. గంగూబాయ్ గుజరాత్ లో గొప్పింట్లో పుట్టిన అమ్మాయి. తన తండ్రి దగ్గర పనిచేసే గుమాస్తాను ప్రేమించి ముంబయ్ చేరిన గంగూబాయిని.. భర్త ఆర్ధిక ఇబ్బందులతో కామాటిపురాలోని వేశ్యా వాటికకు అమ్మేస్తాడు. అక్కడ మాఫియా లీడర్లతో పరిచయాలవల్ల కామాటిపురా ఆమె చేతికి వస్తుంది. దాంతో అక్కడి వేశ్యల అభ్యున్నతికి ఆమె ఎలా కృషి చేసింది.. మధ్యలో ఆమె ఎదుర్కొన్న అవాంతరాలేంటి..? అందులో ఆమె ఎంత నష్టపోయింది..? అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే.

510

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది గంగూభాయ్ గా ఆలియా భట్ నటన గురించి ఈ పాత్ర కోసం తన శక్తినంతా కూడదీసింది ఆలియా భట్. గంగూబాయిగా మారడానికి పూర్తిఎఫెట్ పెట్టింది. రూపు.. ఆహార్యం.,, గాంభీర్యం.. ఇలా అన్ని విషయాల్లో తనను తాను మార్చుకుంది. కాని ఎంత ప్రయత్నం చేసినా.. అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ కనిపించాలి అని లేదు.

610

గంగూభాయ్ గా ఆలియా భట్ అద్భుమైన ప్రదర్శన చేసినా.. ఆమో ఇంకా యంగ్ స్టార్ అవ్వడం..ఇంత చిన్న వయస్సులో.. అంత పెద్ద పాత్ర వెయిట్ ను ఆమె మోయలేక పోయిందన్న విమర్షలు ఒక వైపు వస్తున్నాయి. గంగూబాయ్ లో గాంభీర్య, ఆలియాలో తీసుకురావడం అసాధ్యం.. అందులోనూ ఆలియా మృదువైన గొంతుతో అలాంటి మాస్ డైలాగ్స్ పేలలేదంటున్నారు. మరో వైపు మాత్రం గంగూబాయ్ పాత్రలో ఆలియా చేసిన ప్రయత్నానికి భారీగా అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత వెయిట్ ఉన్న పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేసిందంటున్నారు ప్యాన్స్.

710

ఈ సినిమాలో మిగతా నటీనటులకు కూడా మంచి మార్కులే పడ్డాయి. సీనియర్ విజయ్ రాజ్, శాంతనూ మహేశ్వరి లాంటి సీనియర్లు తమ పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా పాత్ర నిడివి తక్కువే అయినా.. గంగూబాయిని ఆదరించిన రహీమ్ లాలా పాత్రలో అజయ్ దేవగణ్ తళుక్కున మెరిశారు.  దాంతో సినిమా సంపూర్ణం అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది.

810

ఎటువంటి కథ అయినా.. అద్భుతంగా డ్రైవ్ చేయడంతో సంజయ్ లీలా తరువాతే ఎవరైనా. ఆయన డైరెక్షన్ రే 100 శాతం మార్కులు పడ్డాయి. అయితే ఆలియాను గంగూబాయ్ గా తీసుకుని సంజయ్ పెద్ద ప్రయోగమే చేశాడన్న  మాటలు వినిపించినా కాన్ఫిడెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోయాడు సంజయ్. ఇక వివాదాస్పద సినిమాలు తీయడంతో కిక్ ను వెతుక్కునే సంజయ్ లీటా మార్క్ ఈ సినిమాలో కూడా కనిపించింది. గంగూబాయ్ లాంటి మాస్ లీడర్ కథను తీసుకుని.. వివాదాన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయన దిట్ట. పద్మావతి లాంటి సినిమాలకు కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ అయ్యింది.

910

ఇక మ్యూజిక్, సినిమాటో గ్రఫీ.. ప్రొడక్షన్ వాల్యూస్  విషయంలో ఏమాత్రం తగ్గలేదు టీమ్. సంజయ్ లీలా బన్సాలి ఈసినిమాకు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కావడంతో ఎక్కడాతగ్గకుండా సినిమాను నిర్మించారు. ఇక తెలుగులో భీమ్లా నాయక్ ప్రభావంతో ఈ సినిమాకు ఆధరణ తగ్గినా.. సినిమాపై నెగెటీవ్ ఫీలింగ్ మాత్రం రాలేదు జనాలలో..కొంత మంది మాత్రం థియేటర్ లో నిద్ర పోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

1010

ఓవర్ ఆల్ గా ఆలియా భట్ గంగూబాయ్ మహాద్భుతం కాదు కాని.. సినిమా సక్సెస్ సాధించింది అనిపించుకుంది. కధ, ఆలియా భట్.. ఈరెండు ఎలిమెంట్స్ థియేటర్ల దగ్గరకు జనాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. సినిమా మిశ్రమ ఫలితం అని చెప్పలేం.. అలాగని సూపర్ హిట్ అని కూడా చెప్పే వీలే లేకుండా ఉంది. ఇండస్ట్రీ స్టార్స్ మాత్రం గంగూబాయ్ కతియావాడి సినిమా గురించి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో.

click me!

Recommended Stories