Janaki Kalaganaledu: జ్ఞానాంబకు సర్ ప్రైజ్ ఇచ్చిన జానకి, రామచంద్ర.. మల్లిక ప్లాన్ రివర్స్?

First Published Jan 26, 2023, 11:21 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 26వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో జెస్సి చాలా బాగా చెప్పావు అక్క చిన్నదాన్ని కాబట్టి నేను ఏమీ అనలేక పోతున్నాను. ఎదుటి వ్యక్తిని కాదు వాళ్ళ అభిమానాన్ని కూడా గౌరవించాలి అని చాలా చక్కగా చెప్పావు. ఈ మాటలు అక్కకు అర్థం అయ్యాయో లేదో కానీ నాకు మాత్రం బాగా అర్థం అయ్యాయి అంటుంది జెస్సి. తనకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అర్థం అయినా కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది అని అనడంతో వెంటనే మల్లిక సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ఇలా నన్ను మాటలు అనడం నీకు బాగా అలవాటైపోయింది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జ్ఞానాంబ పూజ చేస్తూ ఉంటుంది.
 

ఇంతలోనే వెన్నెల అక్కడికి వచ్చి అమ్మ అమ్మ అని హడావిడి చేస్తుండగా కొద్దిసేపు సైలెంట్ గా ఉండు ఇప్పుడు చెప్పు అని వెన్నెల అనగా మనకోసం బయట ఆటో వెయిట్ చేస్తుంది వెళ్దాం పద అనగా ఎక్కడికో చెప్పు నాకు మొక్కుబడి ఉంది అక్కడికి వెళ్దాం పదమ్మ అని అంటుంది. అప్పుడు గోవిందరాజులు అంతగా అడుగుతుంది కదా వెళ్ళు జ్ఞానం అని అంటాడు. తర్వాత జ్ఞానాంబ, వెన్నెల ఇద్దరు కలిసి అనాధాశ్రమం దగ్గరికి వెళ్తారు. గుడికని చెప్పి అనాధాశ్రమం దగ్గరికి పిల్చుకొని వచ్చావ్ ఏంటి వెన్నెల అనడంతో కారణం లేకుండా ఎందుకు పిలుచుకొని వస్తానమ్మా లోపలికి వెళ్దాం పద అని జ్ఞానాంబ లోపలికి పిలుచుకుని వెళుతుంది.

అప్పుడు ఒక అతను అక్కడికి వచ్చి జ్ఞానాంబను లోపలికి రమ్మని పిలుస్తాడు. జ్ఞానాంబకు అసలు విషయం తెలియకపోవడంతో ఆమె తడబడుతూ ఉంటుంది. ఏంటి వెన్నెల నువ్వు కూడా అన్ని తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు అనడంతో నీకు మళ్ళీ చెప్తాను ముందు లోపలికి పోదామా అని వెన్నెల జ్ఞానాంబని లోపలికి పిలుచుకొని వెళ్తుంది. తర్వాత జ్ఞానాంబ లోపలికి వెళ్ళగానే పిల్లలందరూ ప్రేమతో గులాబీ పూలతో స్వాగతం పలుకుతారు. అప్పుడు జ్ఞానాంబ పిల్లలందరూ ఇంత ప్రేమగా పలకరిస్తుంటే ప్రేమ చూపిస్తుంటే ఒట్టి చేతులతో ఏం చేద్దామని వెన్నెల అనగా ఒట్టి చేతులతో కాదమ్మా అటు చూడు అనడంతో అక్కడ స్వీట్స్ బుక్స్ అని రెడీగా ఉండడంతో అవి చూసి ఆశ్చర్య పోతుంది.

ఇవన్నీ ఎవరు సిద్ధం చేశారు అనగా మేమే అని జానకి రామచంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు వెన్నెల అన్నయ్య వదిన కష్టపడి తయారు చేసిన స్వీట్లు అమ్మ ఇవి అని అంటుంది. అప్పుడు వెన్నెల జరిగింది మొత్తం జ్ఞానాంబకు వివరిస్తూ ఉంటుంది. అన్నయ్య వదిన చాలా కష్టపడి రాత్రంతా మేలుకొని స్వీట్లు తయారు చేశారు అని చెబుతుంది వెన్నెల. ఇదే విషయం ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా అని జ్ఞానాంబ అనడంతో ఇక్కడ చెబితే బాగుంటుందని చెప్పలేదు అమ్మ అంటాడు రామచంద్ర. పరిస్థితులు బాగోలేదు కదా ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది మళ్లీ సంవత్సరం చేసే వాళ్ళం కదా అనడంతో మీరు మళ్ళీ సంవత్సరం చేద్దామని అనుకోలేదు కదా అత్తయ్య అని అంటుంది జానకి.
 

బాబాయ్ గారికి చేసే ప్రతి ఏడాది చేసే కార్యక్రమం ఇప్పుడు చేయలేదని మీరు బాధపడుతున్న విషయం రామచంద్ర గారికి అర్థమయింది. అందుకే ఇదంతా చేసాము అని అంటుంది జానకి. ఆ తర్వాత జ్ఞానాంబ వెళ్లి పిల్లలందరికీ స్వీట్స్ నోట్స్ లు అని పంచుతుంది.  అది చూసి రామచంద్ర, జానకి సంతోష పడుతూ ఉంటారు. తర్వాత కార్యక్రమం పూర్తవడంతో ఆశ్రమంలోని అతను రామచంద్రను గొప్పగా పొగుడుతూ ఇలాంటి కొడుకు ఉండడం నిజంగా చాలా అదృష్టం అని అంటాడు. తల్లికోసం ఇంతగా తపన పడే కొడుకుని ఇప్పుడే చూస్తున్నాను అమ్మ అని అంటాడు. మీ కోడలు కూడా మిమ్మల్ని ఎంతో బాగా అర్థం చేసుకొని మీ కోరికను నెరవేర్చింది అని చెప్పడంతో జ్ఞానాంబ సంతోష పడుతూ ఉంటుంది.
 

మరొకవైపు మల్లిక జానకిని దూరం చేద్దాం అనుకుంటే రోజురోజుకీ మరింత దగ్గరవుతోంది ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబని చూసి ఏదో ఒకటి చూసి అత్తయ్య గారి ఆనందాన్ని చెడగొట్టాలి అనుకొని మల్లిక లోపలికి వెళ్తుంది. అప్పుడు కావాలనే ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ మా అత్తయ్య గారు ఒట్టి అమాయకురాలు జానకి ఏం చెప్పినా ఏం చేసినా కూడా నమ్మేస్తుంది. ఆ జానకి మంచిది అనిపించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంది అది మా అత్తయ్య గారికి అర్థం కావడం లేదు పాపం అంటూ వచ్చిన విధంగా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విని జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. జానకి నన్నే తిడతావా ఇప్పుడు చూడు నీకు ఎలా ఉంటుందో అనుకుంటూ మల్లిక సంతోషపడుతూ ఉంటుంది.
 

ఆ తర్వాత వెన్నెల గోవిందరాజులుకి సేవ చేస్తూ ఉండగా అప్పుడు గోవిందరాజులు రాత్రంతా మేలుకొని ఇవన్నీ చేశారంటే నిజంగా ఇలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అని అంటాడు. ఇందులో నేను చేసింది ఏం లేదు మామయ్య గారు ప్రతి ఏడాది చేసే కార్యక్రమం ఏడాది చేయలేదని అత్తయ్య గారు బాధపడుతుంటే నేను రామచంద్ర గారు కష్టపడి చేశాము అని అంటుంది. ఆ మాటలు అన్నీ మల్లిక వింటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ సంతోషపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జ్ఞానంబ రావడంతో అత్తయ్య గారు ఇదిగోండి మీ కోసమే మజ్జిగ చేసి పెట్టాను తాగండి అనడంతో ఒకరితో సేవలు చేయించుకునే వయసు నాకు ఇంకా రాలేదు అంటుంది జ్ఞానాంబ.
 

నా పనులు నేను చేసుకుంటాను ఎవరు చేయాల్సిన అవసరం లేదు అనగా ఏంటమ్మా వదిన అంతా ప్రేమగా తీసుకువస్తే అని వెన్నెల అనడంతో నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమించానో వాళ్ళ వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని అంటుంది. ఆ మాటలు విన్న మల్లిక సంతోషపడుతూ తిక్క కుదిరింది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి మంచి మాటలు చెప్పి జ్ఞానాంబను కన్విన్స్ చేస్తూ ఉండగా అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. మీరు ఇంటి పెద్ద మీరు ఒక మాట అన్న ఒక దెబ్బ కొట్టిన పడతాము అని ఉంటుంది జానకి. అమ్మో నేను అంత ప్లాన్ చేస్తే జానకి తన మాయమాటలతో అత్తయ్యను కన్విన్స్ చేస్తుంది అనుకుంటూ కుడుకుంటూ ఉంటుంది.

click me!