చీరకట్టు అందాలతో కట్టిపడేస్తున్న పూర్ణ.. ఇన్నాళ్లకు ఆ సీక్రెట్ చెప్పిన ‘ఢీ’భామ!

First Published | Jan 26, 2023, 10:18 AM IST

‘ఢీ’ బ్యూటీ  పూర్ణ చీరకట్టులో అందాల విందు చేసింది. తనకెంతో ఇష్టమైన శారీ లుక్ లో హోయలు పోయింది. ఈ సందర్భంగా తన పోజులతో మైమరిపిస్తోంది. లేటెస్ట్ పిక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి.  
 

హీరోయిన్ పూర్ణ (Poorna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయమేమీ అవసరం లేదు. నటిగా మెప్పించిన ఈ బ్యూటీ బుల్లితెరపైనా సందడి చేసింది. ‘ఢీ’షోలో జడ్జీగా తనదైన శైలిలో ఆడియెన్స్ ను అలరించింది.
 

మరోవైపు స్మాల్ స్క్రీన్ బ్యూటీగానూ గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. తన షో కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ వస్తోంది. ఈ క్రమంలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.


తాజాగా చీరకట్టులో మెరిసిందీ బ్యూటీ. పర్పుల్ కలర్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో అందాల విందు చేసింది. చీరకట్టులో హోయలు పోతూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది పూర్ణ. తన ఫొటోలను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

పూర్ణ చీరకట్టు అందాలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈసందర్భంగా ఆమె బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. తన లేటెస్ట్ ఫొటోలను లైక్స్ తో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ఈ ఫొటోలను పంచుకుంటూ పూర్ణ (షమ్నా కాసీమ్) ఓ సీక్రెట్ చెప్పింది. తనకు ఎలాంటి దుస్తులు అంటే ఇష్టమో తెలియజేసింది. ఫొటోలు షేర్ చేస్తూ ‘నాకు ఎప్పుడూ అత్యంత ఇష్టమైన లుక్ శారీనే’ అని క్యాప్షన్ లో పేర్కొంది. నిజానికి పూర్ణ..  సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తుంది. 

పూర్ణ కూడా ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. తన అభిమానులు సైతం ఆమెను సంప్రదాయ దుస్తుల్లోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ మేరకు చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా పూర్ణ అందరి గుండెల్ని దోచుకుంటోంది.
 

కొన్నాళ్ల పాటు దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali)తో డేటింగ్ లో ఉన్న పూర్ణ.. గతేడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఇక న్యూ ఇయర్ వేళ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది.
 

కొత్త సంవత్సరం రోజున తన ప్రెగ్నేన్సీని కూడా అనౌన్స్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక త్వరలో తల్లికాబోతుండటంతో పూర్ణ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఇలా ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు. 

Latest Videos

click me!