ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక అఖిల్ కోసం ఎదురుచూస్తూ ఈ అఖిల్ ఏంటి ఇంకా రాలేదు అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అఖిల్ రావడంతో ఏంటి అఖిల్ ఎక్కడికి వెళ్తున్నావు ఆ చేతిలో అదేంటి అని అనగా ఏం లేదులే వదినా అని అనగా నువ్వు ఏం లేదులే వదిన అన్నప్పుడే అందులో ఏదో ఉంది అని నాకు అర్థమైందిలే అఖిల్ అని అంటుంది. నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది అఖిల్ అని అంటుంది. అప్పుడు కావాలనే అఖిల్ మనసు చెడగొట్టాలని ప్లాన్ వేసిన మల్లిక ఎందుకులే అఖిల్ జానకి నీ గురించి ఎవరి దగ్గర ఏవేవో చెబుతుందో ఆ విషయాలు నీకెందుకులే అని అంటుంది.