చిన్న కారణంతో రంగస్థలం మూవీలో నటించే ఛాన్స్ అనుపమ పరమేశ్వరన్ కోల్పోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఛాన్స్ కోల్పోయిన అనుపమ దురదృష్టవంతురాలని జనాలు చెప్పుకుంటున్నారు.
పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ కి మించి అదృష్టం గొప్పగా పని చేయాలి. ప్రతిభ ఎంత ఉన్నా లక్ లేకపోతే కెరీర్ కష్టం. అలా లక్ వెనక్కి తన్నడంతో అనుపమ రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ కోల్పోయింది. ఇక అదృష్ట దేవతకు బ్రాండ్ అంబాసడర్ అయిన సమంతకు ఈ ఛాన్స్ దక్కింది.
26
Anupama Parameswaran
రంగస్థలం మూవీ హీరోయిన్ గా అనుపమ(Anupama Parameswaran)ను తీసుకోవాలనే ఆలోచన సుకుమార్ కి ఉన్నప్పటికీ ఒక చిన్న కారణంతో రిజెక్ట్ చేసినట్లు ఆయన తాజాగా వెల్లడించారు. నిఖిల్-అనుపమ హీరో హీరోయిన్స్ గా నటించిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23న విడుదల అవుతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు సుకుమార్ హాజరయ్యారు .
36
ఈ సందర్భంగా ఆయన అనుపమ పరమేశ్వరన్ పై ప్రశంసలు కురిపించారు. అనుపమ మంచి నటి, అలాగే అందమైన హీరోయిన్. తనకు తెలుగుకు కూడా బాగా వచ్చు. ఇది అనుపమకు ఉన్న మరో అదనపు క్వాలిటీ అన్నారు. అలాగే రంగస్థలం మూవీలో అనుపమ చేయాల్సింది, ఒక కారణంతో తీసుకోలేదు అన్నారు.
46
రంగస్థలం చిత్ర ఆడిషన్స్ కి అనుపమ వచ్చింది. ఆడిషన్స్ లో ఏమి అడిగినా వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. వయసులో చిన్న అమ్మాయి. ఎందుకో సందేహం కలిగి అనుపమను తీసుకోలేదు. రంగస్థలం హీరోయిన్స్ గా ఎవరిని తీసుకోవాలనే నా ఆలోచనల్లో అనుపమ కూడా ఉంది. భవిష్యత్ లో కచ్చితంగా మూవీ చేస్తాను, అన్నారు.
56
అనుపమలో ఆత్మవిశ్వాసం కొరవడింది. ఆ కారణంతోనే ఆమెను రంగస్థలం చిత్రానికి తీసుకోలేదని సుకుమార్ చెప్పకనే చెప్పాడు. సుకుమార్ అప్పటికే స్టార్ గా వెలిగిపోతున్న సమంతనుఎంచుకున్నారు. సమంత కెరీర్లో రంగస్థలం గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. పల్లెటూరి చిలిపి, అల్లరి అమ్మాయి అయిన రామలక్ష్మి పాత్రను ఆమె ఎన్నటికీ మర్చిపోలేదు.
66
ఒకవేళ రంగస్థలం మూవీ అనుపమకు పడి ఉంటే ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయేది. స్టార్ హీరోల ఛాయిస్ అయ్యేది. లక్ ఆమెపై సీతకన్నేసింది. సుకుమార్ కి లేనిపోని అనుమానాలు కలిగేలా చేసి రిజెక్ట్ చేసేలా చేసింది. ఇక అనుపమ కెరీర్ ఆ మధ్య డల్ అయ్యింది. కార్తికేయ 2 తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన అనుపమ తిరిగి పుంజుకున్నారు. అనుపమకు అవకాశాలు పెరిగాయి.