అప్పుడు జ్ఞానాంబ అనుమతి లేకుండా లోపలికి వచ్చారు ఎవరు మీరు అని అనగా, మీ పెద్ద కొడుకుని, కోడల్ని అడగండి మేము ఎవరో చెప్తారు.మా కూతుర్ని ప్రేమ అని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మీ కొడుకుని అడగండి అని అనగా, మా కొడుకు ఏమీ అలాంటి తప్పుడు మనిషి కాదు. ముందు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి అని అంటుంది జ్ఞానాంబ. మీ కొడుకు,కోడలి మాట నమ్మి ఇప్పటి దాకా ఊరుకున్నాను. ఒకసారి మీ కొడుకుని కావాలంటే అడగండి మీకే తెలుస్తుంది అని అనగా, మీ కూతురు మీద మీకు ఎంత నమ్మకం ఉందో, నా కొడుకు మీద కూడా, నా పెంపకం మీద నాకు అంతే నమ్మకం ఉన్నది అని అంటుంది జ్ఞానాంబ. అయితే మీరు పెళ్లి చేపిస్తారా చేయించారా అని అడగగా పెళ్లి జరిగే ప్రసక్తే లేదు అని అంటుంది.అప్పుడు జానకి,రామాలు, ఇలా గొడవ జరిగితే పరిష్కారం దొరకదు అని అంటారు.