Intinti Gruhalakshmi: యాక్సిడెంట్ గురించి నందుని ప్రశ్నించిన లాస్య... హనీ మీద బెంగతో కుమిలిపోతున్న సామ్రాట్!

First Published Sep 20, 2022, 10:17 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. నందు, హనీ ని చూస్తూ సామ్రాట్ ఎడడం చూసి బాధపడుతూ, అయినా నేను అంత దుర్మార్గపు పని ఎలా చేశాను ఎలా చేయాలో అనిపించింది అని అనుకుంటాడు. ఇంతలో లాస్య అక్కడికి కోపంగా వచ్చి నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్లావు నందు చాలా లేటుగా వచ్చినట్టున్నావు కదా అని అడుగుతుంది.మందు తాగాను అని అంటాడు నందు.ఎందుకు మందు తాగాలనిపించింది. నువ్వు అతి సంతోషంగా ఉన్న, లేకపోతే అతి బాధ భరించలేకపోయిన తప్ప మందు తాగవు. నిన్న సంతోష పడాల్సిన విషయం ఏం జరగలేదు బాధపడాల్సిన విషయం ఏమైనా జరిగిందా అని అనగా ఏమీ లేదు లాస్య అని అంటాడు నందు. అందుకో నేను చెప్పనా! నిన్న సైట్లో సామ్రాట్ తో తులసి దగ్గరగా ఉండడం నీకు నచ్చలేదు. 

మనం ఒక ఇల్లు కొనుక్కొని అది ఎవరికైనా అమ్మెస్తే అప్పుడు ఆ ఇల్లు ఎలాగున్నాదో వాళ్ళు ఎలా చూస్తున్నారా అని ఆ ఇంటి వైపు ఒక కన్ను వెస్తం.ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా అంతే,నిన్న నువ్వు  ఇంకెక్కడికి వెళ్లావు అని అడుగుతుంది లాస్య. ఇంక ఎక్కడికి వెళ్ళలేదు అని అంటాడు నందు.

లాస్య పదేపదే అడుగుతూ ఉంటుంది నేను చెప్తున్నాను కదా లాస్య ఎక్కడికి వెళ్ళలేదు అని నందు అనగా లాస్య వెళ్లి నందు ఫాంట్ తీసుకొని వస్తుంది. ఆ ఫ్యాంట్ నిండా గీజ్ మరకలు ఉంటాయి. దీని మీదకి మరకలు ఎలా వచ్చాయి నందు. సామ్రాట్ కార్ బ్రేకులు పీకేస్తే వచ్చాయా? అని అడగగా తెలియకుండా చేశాను లాస్య మందు మత్తులో అని అంటాడు నందు.అసలు నువ్విలా ఎలా చేయాలి అనిపించింది నందు. నాకు తులసి అంటే చాలా కోపం కానీ ఎప్పుడూ తనని చంపాలని ఆలోచన కూడా నాకు రాలేదు.ఏమైనా చెడు చేయాలంటేనే ఆలోచించే వాడివి చంపడం వరకు వెళ్లావు అని తిడుతుంది లాస్య.

పోనీ ఈ విషయం ఇంకా ఎవరికైనా తెలుసా అని లాస్య అనగా కార్ మెకానిక్ కి తెలుసు ముందు వాడినే చేయమన్నాను వాడు చేయనుంటే నేను చేశాను అని అంటాడు నందు. ఇప్పుడు వెళ్లి వాడిని ఆపాలి లేకపోతే వాడి వల్ల సామ్రాట్ గారికి తెలిసే ఛాన్స్ ఉన్నది అని అంటారు. ఆ తర్వాత సీన్లో హనీ సోఫా మీద కూర్చొని ఉంటుంది. పక్కనున్న వంట మనిషి భోజనం చేయమ్మా హనీ అని తినిపిస్తుండగా నాకు ఆకలిగా లేదు పడుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది హనీ. అప్పుడు సామ్రాట్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తారు. ఇన్ని రోజులు నేను ఒక్కడినే హనీ ని చుసుకొగలను అనుకున్నాను కానీ ఒకవేళ ఈ ప్రమాదంలో నేను లేకపోయి ఉంటే హనీ ఎలా ఉండేది,హనీ లేకుండా నేను ఎలా ఉండేవాడిని. నేను లేకపోతే హాని అనాధల బతుకుతాది కదా ఆ ఆలోచన కూడా నాకు చాలా భయంకరంగా ఉన్నది అని అంటాడు సామ్రాట్. 

 అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయి, నువ్వు హనీకి అన్ని సౌకర్యాలు ఇవ్వగలవు, కాలు కిందకు పెట్టకుండా చూసుకోగలవు. కానీ తల్లి ప్రేమకు సరిపడా ప్రేమను మాత్రం ఇవ్వలేవు అని అంటాడు. అప్పుడు సామ్రాట్, నిజమే బాబాయ్ తండ్రి ప్రేమ ఎప్పుడూ తల్లి ప్రేమ అవ్వదు. ఈ ఇంట్లో పుట్టినందుకు హనీ ఈ బాధలను అనుభవించాల్సి వస్తుంది అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సామ్రాట్. ఆ తర్వాత సీన్లో తులసి జరిగిన విషయం అంత గుర్తు తెచ్చుకుంటూ హనీ ని చూసి ఏడుస్తుంది.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తులసి ఓదారుస్తారు.అప్పుడు తులసి, పాపం మావయ్య హనీది చాలా చిన్న వయసు తోటి స్నేహితులతో ఆడుకోవాల్సిన వయసులో నొప్పితో బాధపడాల్సి వస్తుంది. అయినా దేవుడు ఎందుకిలా చేశాడు అని అంటుంది. అప్పుడు పరంధామయ్య, దేవుడిని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు కదా అందుకే నచ్చినది చేస్తాడు అని అంటాడు. 

అప్పుడు తులసి, అయినా హనీ అక్కడ ఒక్కతే ఎలా ఉండగలుగుతుందో, ఇలాంటి సమయంలో అందరూ తనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది అని అనగా అభి, అక్కడ తన్ని చూసుకోవడానికి చాలా పని వాళ్ళు ఉన్నారమ్మ తనకోసం నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అభి నే తిడుతూ, తల్లి ప్రేమ పనివాళ్ళు తీర్చలేరు అభి, అది తల్లి ఉన్న చాలా మందికి తెలియదు. తల్లి లేని వాళ్ళకి తెలుస్తుంది. అయినా సామ్రాట్ గారికి కూడా దెబ్బలు తగిలాయి,హానీ నీ చూసుకోలేరు కదా అని అంటారు.అప్పుడు పరంధామయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది హనీ నీ మన ఇంట్లో ఉంచుకుందాము. అందరి మధ్య  హనీ ఏ లోటు లేకుండా పెరుగుతుంది అని అనగా, ఈ ఆలోచన బానే ఉంది మావయ్య కానీ సామ్రాట్ గారూ హానీ లేకుండా ఉండలేరు అని అంటుంది తులసి.

అప్పుడు అభి, సామ్రాట్ గారు ఒకరోజు హానీ లేకపోతేనే మన ఇంటికి గొడవకి వచ్చారు. ఇప్పుడు మన ఇంట్లో హనీకి ఏమైనా అయితే మనందరిని చంపేస్తారు అని అంటాడు. అప్పుడు అనసూయ తులసి తో ఒకసారి అడిగి ప్రయత్నించు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో లక్కీ స్కూల్ కి బయలుదేరుతూ ఉండగా, అమ్మ హనీ నే ఆక్సిడెంట్ అయిందా? అని అడుగుతాడు. అవును లక్కీ ఆక్సిడెంట్ అయింది నీకు ఎలా తెలుసు అని అనగా స్కూల్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అమ్మ. అయినా నీకు ఈ విషయం ముందే తెలిసినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు. నేను వెళ్లి హనీ ని పలకరిస్తాను అని అంటాడు.అప్పుడు నందు,తనతో నీకు  ఎందుకు ఎంత స్నేహం,ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.స్నేహితురాలికి బాగొలేనప్పుడు  ఇంటికి వెళ్లి పలకరించడం మర్యాద  అని అంటాడు.

అప్పుడు నందు, చిన్నపిల్లడివి నువ్వు కూడా నాకు మర్యాదలు చెప్తున్నావేంటిరా అని తిడతాడు.అప్పుడు లాస్య,మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాము వెళ్లి బట్టలు మార్చుకో  అని లక్కీని లోపలికి పంపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంటికి ఎందుకు అని నందు,లాస్య అని అడగగా, ఈ సమయంలోనే మనం సామ్రాట్ గారికి దగ్గర అయితే మన ఉద్యోగాలకి చాలా సహాయం అవుతుంది. మనం వీలైన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి అని అంటుంది. ఇంతలో లక్కీ తయారయ్యి వస్తాడు. ముగ్గురు సామ్రాట్ ఇంటికి బయలుదేరుతారు. ఆ తర్వాత సీన్లో తులసి ఇంట్లో పాయసం చేస్తూ ఉంటుం.ది దివ్య, శృతి లు పాయసం గురించి తులసిని పొగుడుతూ ఉంటారు. పరంధామయ్య, అనసూయలు సోఫాలో కూర్చొని వాసన చాలా బాగా వస్తున్నాయి. మనము వెళ్లి ఒక పట్టు పడతాము కానీ మనకి షుగర్ అని తులసి మనల్ని తినొద్దంటుంది.ఒకసారి అడిగి చూద్దామని అనుకుంటారు. అప్పుడు అనసూయ కిందటిసారి మీరు వెళ్లి భోజనం పాయసం అడిగితే మీకు షుగరు అస్సలు పెట్టను అని చెప్పేసింది. 

 ఇప్పుడు మనకు ఎలాగా అని అంటుంది.అయిన నాకు తెలీదు భార్య గా నేను మిమ్మల్ని కోరగా అడిగాను భర్తగా తీర్చాల్సిన బాధ్యత మీది అని అంటుంది  అప్పుడు పరంధామ్య ఐడియా వచ్చింది అని ఫోన్లో చిన్న పాప ఏడుస్తున్న శబ్దం పెడతాడు. ఇంట్లో వాళ్ళందరూ చిన్న పాప ఏడుపు ఎక్కడినుంచి వస్తుందా అని ఇల్లంతా వెతుక్కుంటారు. ఇంతలో వీళ్ళిద్దరూ కిచెన్ లోకి వెళ్లి పాయసం తింటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ సోఫాలో ఫోన్ ని చూసి ఇందులో నుంచి వస్తుంది శబ్దం అని అనుకుంటాడు. అప్పుడు తులసి అయితే ఇది దొంగలు పనే అయ్యి  ఉంటది అని అందరినీ  కిచెన్ వద్దకు తీసుకువెళ్తుంది. అప్పటికే అనసూయ, పరంధామయ్య పాయసం తింటూ ఉంటారు.మావయ్య  మీ బాబు దొరికేసాడు అని తులసి ఫోన్ చూపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దర్నీ చూసి ఇంట్లో వాళ్ళు అందరూ నవ్వుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!