ఆ తర్వాత విన్నీ ఖుషితో కలిసి సరదాగా ఫోటోలు దిగుతూ ఉంటాడు. అప్పుడు యష్, వేద లను పిలుస్తాడు విన్నీ. అప్పుడు వాళ్ళిద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే మాళవిక బ్రమరాంబిక అక్కడికి వస్తారు. అప్పుడు మాళవికను చూసి షాక్ అవుతారు వేద, యష్. అప్పుడు మాలిని,సులోచన వేద లను భ్రమరాంబికకు పరిచయం చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ మాళవిక ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది చూసి ఎవరు ఏమీ తెలియనట్టుగా బాగానే నటిస్తున్నారు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు భ్రమరాంబిక వేద దగ్గరికి వెళ్లి చాలా అందంగా ఉన్నావు యశోదర్ నువ్వు చాలా లక్కీ అని అనడంతో, అప్పుడు యష్ కావాలనే వేద భుజంపై చెయ్యి వేసి నా భార్యను చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అనడంతో మాళవిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది.