క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న ‘ధమాకా’బ్యూటీ.. మత్తు కళ్లతో మాయజేస్తున్న యంగ్ బ్యూటీ!

First Published | Jan 30, 2023, 12:30 PM IST

యంగ్ హీరోయిన్  శ్రీలీలా (Sreeleela) పేరు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది. ‘పెళ్లి సందD’ చిత్రంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది.
 

‘పెళ్లి సందD’ చిత్రంతో యంగ్ హీరోయిన్ శ్రీలీలా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన విషయం తెలిసిందే. తనదైన పెర్ఫామెన్స్, గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. రీసెంట్ గా ‘ధమాకా’తోనూ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుని మంచి జోష్ లో ఉంది.
 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్న ఈ బ్యూటీ మరోవైపు గ్లామర్ లుక్స్ తోనూ వెండితెరపై అందరిని మెస్మరైజ్ చేస్తోంది. అదేవిధంగా డాన్స్ లోనూ ఇరగదీస్తూ ఆడియెన్స్  ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలతో నటిస్తూ  దూసుకుపోతోంది.
 


మరోవైపు సోషల్ మీడియాలోనూ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. క్యూట్ లుక్స్, మైండ్ బ్లోయింగ్ పోజులతో కుర్ర గుండెల్ని పేల్చేస్తోంది. శ్రీలీలా అందాల ధాటికి యువత చిత్తై పోతోంది.

తాజాగా గ్రీన్ కలర్ ట్రెడిషనల్ లుక్ లో మైండ్ బ్లాక్ గా ఫొటోషూట్ చేసింది. చుడీదార్ లో కవ్వింపు చర్యలకు దిగింది. మత్తు చూపులతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. చిలిపి నవ్వులతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. 

తను పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం యంగ్ బ్యూటీ చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమాలోనూ నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్ అంటున్నారు. 
 

ఇక నందమూరి బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో  ఎన్బీకే108లోనూ ఈ బ్యూటీ కనిపించబోతోంది. బాలయ్యకు కూతురి పాత్రలో నటించబోతోంది. దీంతో శ్రీలీలా క్రేజ్ మరింత పెరగబోతోంది. మరో రెండు హిట్లు పడితే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోనుంది. 
 

Latest Videos

click me!