లావిష్‌ గా పవన్‌-సుజీత్‌ మూవీ ఓపెనింగ్‌.. స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న పవర్‌ స్టార్‌.. ఫోటోలు ట్రెండింగ్‌

First Published Jan 30, 2023, 12:13 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా `ఓజీ` గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్టయిలీష్‌ లుక్‌లో పవన్‌ ఆకట్టుకుంటున్నారు. ఓపెనింగ్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 
పవన్‌ కళ్యాణ్‌.. `సాహో` ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. `ఓజీ`(ఒరిజినల్‌ గ్యాంగ్ స్టర్‌) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా సోమవారం ఈ సినిమా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్‌ జరిగింది. 

పవన్‌ సినిమా కావడంతో ఓపెనింగ్‌ సెట్‌ గ్రాండ్‌గా వేశారు. రాజమందిరాన్ని తలపించేలా ఈ సెట్‌ ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ ప్రారంభోత్సవానికి పవన్‌ కళ్యాణ్ భారీ కాన్వాయ్‌తో వచ్చారు. ఆయన తన కారుని స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ రావడం విశేషం. ఇక ఇందులో పవన్‌ బ్లాక్‌ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్‌ ధరించారు. ఆయన లుక్‌ చాలా స్టయిలీష్‌గా ఉంది. ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది.

ఇక ఈ ప్రారంభోత్సవంలో నిర్మాతలు,సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో అల్లు అరవింద్‌, దిల్‌రాజు, సురేష్‌బాబు, కోన వెంకట్‌ వంటి ఇతర యూనిట్‌ సభ్యులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. 

తమన్‌ సంగీతం అందిస్తున్నారు. వీరితోపాటు ఇందులో భారీ కాస్టింగ్‌ నటించబోతుందట. ప్రకాష్‌ రాజ్‌, రక్షిత్‌ శెట్టి, టబు, అనుపమ్‌ ఖేర్‌ వంటి భారీ కాస్టింగ్‌ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

గ్యాంగ్‌స్టర్‌ ప్రధానంగా సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. సినిమా ఎప్పుడు రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందనేది తెలియాల్సి ఉంది. 
 
ప్రస్తుతం పవన్‌-సుజీత్‌ మూవీ `ఓజీ` ఓపెనింగ్‌ సెట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడంతా పవన్‌ మానియా సాగుతుందని చెప్పొచ్చు. 
 
click me!