ఎపిసోడ్ ప్రారంభంలో మాలిని ఆదిత్య, ఖుషి లకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఖుషి ఆమ్లెట్ కావాలంటూ పేచీ పెడుతుంది. ఆమ్లెట్ లేదు ఏమి లేదు కూర అన్నం తిను అంటుంది మాలిని. అంతలోనే అక్కడికి వచ్చిన యష్ తను ఆమ్లెట్ లేకుండా అన్నం తినదు కదమ్మా వదిలేయ్ అంటాడు. రోజు ఆమ్లెట్ తింటూ అసలు కూరలు తినడం మానేసింది అంటుంది మాలిని.