అమలాపాల్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు, డబ్బు కోసం ఆ పని చేస్తూ.. అసభ్యంగా గెటప్

First Published Jun 9, 2023, 11:05 AM IST

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది.  గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది.

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది.  గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
 

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

అమలాపాల్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆమెని నెటిజన్లు టార్గెట్ చేశారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారతావా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

ఇంతకీ అమలాపాల్ ఏం చేసిందట.. ఆమె ఇటీవల గ్యాంబ్లింగ్ క్రీడ అయిన క్యాసినో బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఆ కంపెనీ పార్టీలో పాల్గొంది. సదరు క్యాసినో సంస్థ ప్రమోషన్స్ కోసం మోడల్స్ ని, కొందరు నటుల్ని ఎంపిక చేసుకున్నారు. తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి భారీ మొత్తంలో ముడుతుంది. 

అమలాపాల్ అత్యంత దారుణంగా, వల్గర్ గా ఉన్న ఎల్లో డ్రెస్ లో ఈ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ మీ క్యాసినో ఆడుతున్న దృశ్యాలు, ఫుల్ మూడ్ లో అసభ్యంగా చిందులేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఆమె ధరించిన డ్రెస్ అయితే ఒకవైపు థైస్ మొత్తం కనిపించేలా ఉంది. పైగా విచితమైన గెటప్ లో అమలాపాల్ అసభ్యంగా ఉంది. దీనితో నెటిజన్లు ఆమె గెటప్ పై కూడా ట్రోల్ చేస్తున్నారు.సంపాదన కోసం ఇలాంటి మార్గాలు ఎంచుకోవాలా అని ఆమెపై పోస్ట్ లు పెడుతున్నారు.  ఏది ఏమైనా అమలాపాల్ మరోసారి నెటిజన్లకు టార్గెట్ గా మారింది. 

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

click me!