టైట్ జీన్స్ లో నడిరోడ్డుపై ‘బిగ్ బాస్‘ బ్యూటీ రచ్చ.. అషురెడ్డి వాడే కారు ధరెంతో తెలిస్తే షాకే.!

First Published | Jun 9, 2023, 11:37 AM IST

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) ఇప్పుడిప్పుడే వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగా అవకాశాలను అందుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తోంది. 
 

డబ్ స్మాష్ వీడియోలతో మంచి క్రేజ్ దక్కించుకుంది అషురెడ్డి. తన గ్లామర్, లుక్స్, అందమైన రీల్స్ తో జూనియర్ సమంతగా యూత్ గట్టి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే ‘బిగ్ బాస్‘ తెలుగు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) తోనూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ నెట్టింట సెన్సేషన్ గా మారుతుంటుంది. అలాగే  ఫ్యాన్స్ ను, నెటిజన్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఈ ముద్దుగుమ్మ క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ వస్తోంది. 
 


తాజాగా అషురెడ్డి మరిన్ని ఫొటోలను పంచుకుంది. ట్రెండీ వేర్స్ లో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. టైట్ జీన్స్, టాప్ లో కిల్లింగ్ ఫొజులతో అట్రాక్ట్ చేసింది. ఏకంగా నడిరోడ్డుపై అషురెడ్డి స్టిల్స్ తో మతులు పోగొట్టింది. రచ్చరచ్చ చేసింది.
 

ప్రస్తుతం ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. తన ఫ్యాషన్ సెన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు కొత్తగా కనిపించడంలో ముందుంటుందని పొగుడుతున్నారు. ఇదిలా ఉంటే మరో న్యూస్ ఆసక్తికరంగా మారింది.

లేటెస్ట్ గా అషురెడ్డి పంచుకున్న ఫొటోల్లో తను వాడే కారును కూడా చూపించింది. మసెరటి ఘిబ్లీ 2021 అనే స్టోర్ట్స్ కారును వాడుతోంది.  ఈ కారు ధర అక్షరాల కోటీ 20 లక్షల వరకు ఉంటుంది. అషురెడ్డి ఇంత ఖరీదైన కారులో షికారు చేస్తుండటంతో స్టన్ అవుతున్నారు.

ఇక అషురెడ్డి కూడా బిగ్ బాస్ తర్వాత వీలైనన్నీ మార్గాల్లో సంపాదిస్తోంది. మాల్స్ ఓపెనింగ్, యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, సినిమాలు, ఆయా ఈవెంట్లకు హాజరవుతూ కాస్తా డబ్బు కూడబెడుతోంది. ఇదిలా ఉంటే.. నటిగా అవకాశాలూ అందుకుంటోంది. చివరిగా ‘ఫోకస్’తో అలరించగా.. ప్రస్తుతం ‘AMC’ అనే మూవీతో రానుంది. 
 

Latest Videos

click me!