Ennenno janmala bandham: మాట్లాడుకుంటున్న యష్, వేదను చుసిన మాళవిక.. ఖుషిని అమెరికా పంపించేస్తానంటూ షాక్?

Navya G   | Asianet News
Published : Feb 15, 2022, 01:18 PM IST

Ennenno janmala bandham: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno janmala bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పిల్లలు పుట్టలేని ఓ అమ్మాయి.. తల్లి లేదని బాధపడుతున్న చిన్నారి బాధను చూపిస్తూ వారి ఇద్దరి మధ్య ప్రేమను చూపిస్తున్న ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైపోయింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
17
Ennenno janmala bandham: మాట్లాడుకుంటున్న యష్, వేదను చుసిన మాళవిక.. ఖుషిని అమెరికా పంపించేస్తానంటూ షాక్?

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. సులోచన వాళ్ల కూతుళ్లతో కలిసి అల్లు అర్జున్ పుష్ప మూవీ లో సాంగ్ కి స్టెప్పులు వేసుకుంటూ ఉంటుంది. ఈ మూమెంట్ లో వేద (Vedha) కూడా కొంత సేపు హడావిడి చేస్తుంది. మరోవైపు మాలిని (Malini) ఫ్యామిలీ కూడా 'శ్రీవల్లి' పాటకు డాన్స్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. ఈ ఫన్నీ డాన్స్ ను మాలిని, యశోధర్ తో కూడా చేయిస్తుంది. 

27

ఈ క్రమంలో మాలిని ఏడుస్తూ నీ కళ్ళలో ఆనందం చూసి ఎన్ని రోజులు అయింది రా అంటూ ఏడుస్తుంది. దానికి యశోదర్ (Yasodar)  ఊరుకో అమ్మ అని ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత యశోదర్ (Yasodar) , వేదతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగా వేద యశోద దగ్గరికి వచ్చి నాకు అర్జెంట్ పనుంది అని చెబుతుంది. సో ఒక నిమిషం లో మేటర్ ఏంటో చెప్పండి అని అంటుంది. 

37

ఇక యశోదర్ అర్జెంట్ పని అయితే వెళ్ళండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగా వెద (Veda) ఎం చెప్పాలో తెలియక ఒక నిమిషాన్ని కాస్త అరగంట సమయం చేస్తుంది. ఇక యశోదర్, వెద (Veda) కు ఎంగేజ్మెంట్లో బంగారపు ఉంగరం పెట్టలేదు కదా సో నీకు మంచి ఉంగరం కొనిపెడతాను పదా షాపింగ్ కి వెళదాం అంటాడు. 

47

ఇక వేద నాకు ఈ ఉంగరం కంటే విలువైన ఉంగరం నాకు ఏది లేదు అని చెప్పగా యశోదర్ (Yasodar) మనసులో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు. వీరిద్దరూ మాట్లాడుతుండగా అభిమన్యు (Abhimanyu), మాళవికలు ఖుషిను వేద దగ్గర డ్రాప్ చేయడానికి వస్తారు. ఈ క్రమంలో వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసిన మాళవిక అక్కడికి వస్తుంది. 
 

57

ఇక మాళవికను చూసిన యశోదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యశోదర్ ఏంటి నిన్ను కాక పడుతున్నాడు అని మాళవిక, వేద (Veda) ను అడుగుతుంది. అయితే వేద వేరే విషయం అని చెప్పి డైవర్ట్ చేస్తుంది. నీకు ఎంగేజ్ మెంట్ అయిపొయింది కదా.. నీకు కాబోయే వారెవరో చెప్పనే లేదు అని అడిగితే చెప్పావు ఏంటి అంటుంది.. 

67

అప్పుడు ఏం చెప్పాలో తెలియాని వేద బిక్క ముఖం వేసుకొని చూస్తుంటే.. నీకు కాబోయే భర్తను నేను చూసానులే.. సెల్ఫీ తీసుకుంటుంటే చూశాను.. కానీ అతనికి కాస్త వయసు ఎక్కువైనట్టు అనిపించింది అని చెప్తుంది.. అప్పుడు వేద .. బావను చూసినట్టుంది అనుకోని ఊపిరి పీల్చుకుంటుంది. అనంత పెళ్లి డేట్ గురించి చెప్పగా..  

77

ఆ తర్వాత మాళవిక (Malavika) ఖుషిను వేదకు అప్పగిస్తుంది. దాంతో వేద ఎంతో సంతోషపడుతుంది. ఇక ఖుషి వచ్చిన తర్వాత వేద అందరితో కలిసి 'ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ' అంటూ ఆనందంగా చిందులు వేస్తుంది. ఆ తరువాత ఖుషి.. వేదను అమ్మ అని పిలుస్తుంది దాంతో వేద, ఖుషిను (Khushi) దగ్గరికి తీసుకుని ఎంతో సంతోషిస్తుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ చోటుచేసుకుంటుందో చూడాల్సి ఉంది. 

click me!

Recommended Stories