Janaki kalaganledu: వెన్నెలను మోసం చేశావని నిందించిన జ్ఞానాంబ.. ఆలోచనలో పడ్డ జానకి, రామచంద్ర!

Navya G   | Asianet News
Published : Feb 15, 2022, 12:09 PM IST

Janaki kalaganledu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు (Janaki kalaganledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జానకి,  రామ చంద్ర ల దగ్గరకు జ్ఞానాంబ (Jnanaamba)  వచ్చి వెన్నెల కు ఎల్లుండి నిశ్చితార్థం అని చెప్పగా  వీరిరువురు షాక్ అవుతారు.

PREV
15
Janaki kalaganledu: వెన్నెలను మోసం చేశావని నిందించిన జ్ఞానాంబ.. ఆలోచనలో పడ్డ జానకి, రామచంద్ర!

ఆ తర్వాత రామచంద్ర (Rama chandra) అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని జ్ఞానాంబ తో అంటాడు. ఇక దాంతో జ్ఞానాంబ ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి ఏ విషయమైనా వెన్నెల నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక జానకి, రామచంద్రలు వెన్నెల (Vennela) పరిస్థితిని పెళ్ళికొడుకు తండ్రికి చెప్పడానికి బయలుదేరుతారు.
 

25

మరోవైపు తలుపులమ్మ (Talupulamma) , మల్లికను ఒక్క కాలుతో ఆసనం వేయించి మల్లికను ఆడుకుంటుంది. ఆ ఆసనంలో ఉన్న మల్లికను వాళ్ళ భర్త చూసి ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళిన జానకి రామచంద్ర (Rama chandralu) లు నిశ్చితార్థం జరగదు అని చెప్పగా పెళ్లి కొడుకు తండ్రి సీరియస్ అవుతాడు.

35

ఈ క్రమంలో నే వెన్నెల (Vennela)  ప్రేమ విషయం గురించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోక పోతే  చని పోతుంది అన్న సంగతి చెబుతాడు రామచంద్ర. దాంతో పెళ్ళికొడుకు తండ్రి అందరి ముందు మా పరువు పోగొట్టుకోవాలా అంటూ విరుచుకుపడతాడు. వెన్నెల పరిస్థితి గురించి జానకి (Janaki) ఎంత చెప్పినా పెళ్ళికొడుకు తండ్రి వినకుండా  'అమ్మా వెళ్లి మీ ఆడపడుచుకు నచ్చ చెప్పుకోండి' అని అంటాడు.

45

ఇక దాంతో జానకి, రామచంద్ర (Ramachandra) లు అక్కడి నుంచి ఇంటికి బయలు దేరుతారు. ఇక మరోవైపు  జ్ఞానాంబ నిశ్చితార్థ ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించిన వెన్నెల (Vennela)  నిశ్చితార్థం కాన్సిల్ చేసే క్రమంలో ఎన్ని గొడవలు జరుగుతాయో అని ఒక పక్క నుండి బాధపడుతూ ఉంటుంది.

55

ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanaamba), వెన్నెల దగ్గరికి వచ్చి వెన్నెలను ఎంత గొప్పగా చూసుకున్నానొ చెప్పుకుంటూ తల్లి కూతుర్ల బంధం గురించి వెన్నెలకు తెలుపుతుంది. ఈ క్రమంలోనే వెన్నెల (Vennela) ప్రేమ విషయంలో మోసం చేసిన సంగతి గురించి కూడా జ్ఞానాంబ దెప్పి పొడుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ చోటుచేసుకుంటుందో చూడాలి. 

click me!

Recommended Stories