Kajal Agarwal: పదేళ్ల క్రితమే ప్రేమ పుట్టిందట.. అసలు సీక్రెట్‌ బయటపెట్టిన చందమామ.. ఫ్యాన్స్ కి మరింత గాయం..

Published : Feb 15, 2022, 12:19 PM ISTUpdated : Feb 15, 2022, 05:22 PM IST

అందాల చందమామ కాజల్‌ తన అభిమానులకు షాకిస్తూ రెండేళ్ల క్రితం ప్రేమని ప్రకటించింది. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద షాకిచ్చింది. అసలు సీక్రెట్‌ని బయటపెట్టింది. తన ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో వెల్లడించింది.   

PREV
17
Kajal Agarwal: పదేళ్ల క్రితమే ప్రేమ పుట్టిందట.. అసలు సీక్రెట్‌ బయటపెట్టిన చందమామ.. ఫ్యాన్స్ కి మరింత గాయం..

స్టార్‌ హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే మ్యారేజ్‌ చేసుకుంది కాజల్‌. అగ్ర హీరోలకు పర్‌ఫెక్ట్ జోడీగా నిలుస్తున్న సమయంలో కాజల్‌ ఉన్నట్టుంది తన ప్రేమని ప్రకటించింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌కిచ్లు తన ప్రేమని వ్యక్తం చేశాడని, అందుకు ఎస్‌ చెప్పినట్టు 2020 అక్టోబర్‌ 6న వెల్లడించింది కాజల్‌. అంతేకాదు అదే నెలలో 30న తాము వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పి అభిమానుల హార్ట్ బ్రేక్‌ చేసింది. 

27

అందాల చందమామూ ఆరాధిస్తూ, ఆమెనే అభిమానిస్తూ ఉన్న అభిమానులకు కాజల్‌ ప్రకటన పిడుగుపడ్డట్టయింది. దీంతో ఎంతో మంది అభిమానులు పిచ్చొళ్లైపోయారు. తమ గుండె పగిలిందంటూ ఆమె కామెంట్లు పెడుతూ హార్ట్ బ్రేకింగ్‌ ఎమోజీలను పంచుకున్నారు. తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఏనాడు ఎఫైర్‌ వార్తలు తనపై రాకుండా చూసుకున్న కాజల్‌.. సడెన్‌గా తన లవ్‌ స్టోరీని ప్రకటించడంతో నిజంగానే ఫ్యాన్స్ కి పెద్ద షాకే అని చెప్పాలి. 
 

37

దీంతో నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డ అభిమానులు ఆమెకి విషెస్‌ చెబుతూ, భర్త గౌతమ్‌తో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆమెని నిత్యం చూస్తూ అభిమానాన్నిచాటుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న(సోమవారం-ఫిబ్రవరి 14)న ప్రేమికుల రోజు సందర్భంగా మరో షాకిచ్చింది కాజల్‌. అసలు గౌతమ్‌తో ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో వెల్లడించింది. పదేళ్ల క్రితమే తమ ప్రేమ స్టార్ట్ అయ్యినట్టు చెప్పింది. 

47

2012లోనే తమ ప్రేమ చిగురించిందని వెల్లడించింది కాజల్‌. ఈ మేరకు తన భర్తతో కలిసి దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ సందర్భంగా భర్త గౌతమ్‌ కిచ్లుకి వాలెంటైన్స్ డే విషెస్‌ తెలిపింది. తాను ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటానని తెలిపింది కాజల్‌. బేబీ బంమ్స్ తో భర్తతో దిగిన ఫోటోని పంచుకోగా అది వైరల్‌ అవుతుంది.

57

దీంతో మరోసారి షాక్ అవుతున్నారు అభిమానులు. పదేళ్ల క్రితమే తమ ప్రేమ ప్రారంభమైందని చెప్పడంతో ఇన్నాళ్లు తాము బకరా అయిపోయామా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. `ఈ హీరోయిన్లు ఉన్నారే.. మా అభిమానుల మనసులను అస్సలు అర్థం చేసుకోలేరంటూ` ఆవేదన చెందుతున్నారు. లవ్‌ ఫెయిల్యూర్‌ సాంగ్‌లతో సేదతీరుతున్నారు. 
 

67

ఇక కొత్త సంవత్సరం సందర్భంగా కాజల్‌ ప్రెగ్నెన్సీని ప్రకటించారు భర్త గౌతమ్‌ కిచ్లు. ఈ ఏడాది తమ జీవితంలోకి గొప్ప సంతోషం రాబోతుందని, ఈ ఏడాది తమకు స్పెషల్‌గా ఉండబోతున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత కాజల్‌ సైతం ప్రెగ్నెన్సీపై స్పందించింది. బాడీ షేమింగ్‌పై వచ్చిన ట్రోల్స్, విమర్శలపై స్పందించింది. ఆవేదన చెందుతూనే మాతృత్వంలోని ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా బేబీ బంమ్స్ తో దిగిన ఫోటోలను పంచుకోగా అవి ట్రెండ్‌ అయ్యాయి. 
 

77

మరోవైపు కాజల్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి పదిహేనేళ్లు అవుతుంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలోరూపొందిన `లక్ష్మీ కళ్యాణం` చిత్రంలో నటించింది. ఈ చిత్రం 2007 ఫిబ్రవరి 15న విడుదలైంది. తాజాగా నేటితో అది పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో కాజల్‌ పదిహేనేళ్ల కెరీర్‌ సీడీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories