Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంచి కథతో ప్రసారమవుతుంది. రేటింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
వేద (Vedha), యష్ (Yash) పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న అధికారి వారితో కాసేపు సరదాగా మాట్లాడుతాడు. ఇక అంతలోనే వీరిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. దీంతో వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వెనుకకు వస్తారు.
27
వారిద్దరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి బయటకు రావడంతో అక్కడే ఉన్న మాళవిక (Malavika) వాళ్లను చూసి షాక్ అవుతుంది. వీరిద్దరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అనుకుంటుంది. మరోవైపు సులోచన (Sulochana) వరదరాజుకు జ్యూస్ తాగమని ఇస్తుంది.
37
వరదరాజు (Varadharaju) పెళ్లికి ఒప్పుకుంటేనే తాగుతాను అనేసరికి ఆల్రెడీ పెళ్లికి ఒప్పుకుందని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇక వరదరాజు సంతోషపడి వెంటనే రత్నం (Ratnam) వాళ్ళ ఇంటికి వెళ్లాలి అనుకుంటాడు. కానీ సులోచన.. వాళ్లే వచ్చి అడగాలని ట్విస్ట్ ఇస్తుంది.
47
మరోవైపు మాళవిక (Malavika) వేద కు ఫోన్ చేసి తనను కలవమని అడుగుతుంది. పక్కన యష్ కూడా ఉంటాడు. మళ్లీ వారి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వరదరాజులు, రత్నం (Ratnam) బయటకు వచ్చి పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోష పడతారు.
57
ఇక సంబంధం కోసం ఒక మెట్టు దిగిన సరిపోతుంది అంటూ సులోచన (Sulochana) ను ఒప్పించి తీసుకువస్తానని అంటాడు. ఇక అభిమన్యు, మాళవిక వేద గురించి మాట్లాడుతూ ఉంటారు. వేద దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడతాను అని మాళవిక (Malavika) అంటుంది.
67
అది విన్న ఖుషి (Khushi) నేను కూడా నా ఫ్రెండ్ దగ్గరికి వస్తాను అని అంటుంది. ఇక సరే అని మాళవిక తనను లోపలికి పంపిస్తుంది. ఇక సంబంధం కోసం సులోచన అన్నీ సిద్ధం చేసుకుని ఉంటుంది. తీరా మాలిని (Maalini) వాళ్ళ డోర్ చూసి భయపడి వెనక్కి వెళ్తుంది. పదేపదే అలా చేయటంతో అక్కడ కాస్త ఫన్నీగా అనిపిస్తుంది.
77
సులోచన (Sulochana) వాళ్ళు వస్తున్నారని మాలిని కాస్త ఓవర్ గా చేస్తుంది. మొత్తానికి సులోచన వాళ్ళు మాలిని ఇంట్లోకి వెళ్తారు. మాలిని స్టైల్ గా వాళ్ల దగ్గరికి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే యష్, వేద (Vedha) ఇంట్లోకి వస్తారు.