Janaki Kalaganaledu: జానకిని చదివిస్తా అని చెప్పిన రామ.. జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది!

Navya G   | Asianet News
Published : Feb 01, 2022, 11:13 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఎంటో చూద్దాం.  

PREV
16
Janaki Kalaganaledu: జానకిని చదివిస్తా అని చెప్పిన రామ.. జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది!

పోలీస్ అధికారులు జ్ఞానంబ (Jnanamba) ఇంటికి వచ్చి జానకి చదువు గురించి అడుగుతారు. తమ పై అధికారి ఇటువంటి ధైర్యసాహసాలు ఉన్న అమ్మాయి డిపార్ట్మెంట్ లో ఉంటే మంచి పేరు వస్తుందని అంటారు. ఇక అప్పుడే జానకి (Janaki) రావడంతో తన నిర్ణయాన్ని అడుగుతారు.
 

26

మరోవైపు మల్లిక (Mallika) కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక జానకి తన నిర్ణయాన్ని చెప్పాలని అనుకోవటం తో వెంటనే జ్ఞానాంబ జానకి (Janaki) ను ఆపి తమ నిర్ణయాన్ని మీరు చెప్పినట్లుగానే కుటుంబమంతా కలిసి నిర్ణయం తీసుకొని చెబుతాను అని అంటుంది.
 

36

ఇక ఆ పోలీసు అధికారులు మాత్రం జానకిని (Janaki) ఎలాగైనా ఐపీఎస్ గా చూడాలి అని అనుకోటంతో పదే పదే జ్ఞానంబను (Jnanamba) అడుగుతూ ఉంటారు. ఇక వారికి తమ నిర్ణయాన్ని తర్వాత చెబుతాము అని మళ్ళీ అంటుంది. ఇక పోలీసు అధికారులు అక్కడినుంచి వెళుతూ వెళుతూ మీ నోటి నుంచి ఎలాగైనా మంచి నిర్ణయం రావాలని కోరుకుంటున్నాము అని వెళ్లిపోతారు.
 

46

ఆ మాట విన్న జానకి (Janaki) షాక్ అవుతుంది. ఇక ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా రామచంద్ర (Rama Chandra) వచ్చి తనకు అమ్మవారి బొట్టు పెట్టి ధైర్యం చెబుతాడు. ఎలాగైనా అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని అందుకే సమయం తీసుకుందని అంటాడు. ఎలాగైనా నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలి అని అంటాడు.
 

56

ఆ తర్వాత జానకి (Janaki) ఐపీఎస్ అధికారిగా కారు దిగి ఇంట్లోకి వస్తుంది. మల్లికను పిలిచి తను చేసే స్వీట్ లో కల్తీ నెయ్యి కలపడం వల్ల పలువురు అస్వస్థకు గురయ్యారని అరెస్టు చేయడానికి వచ్చానని అంటుంది. ఇక మల్లిక (Mallika) సినిమా స్టైల్ లో డైలాగులు చెబుతూ ఉంటుంది.
 

66

కానీ జానకి (Janaki) మాత్రం వినిపించుకోకుండా తనను అరెస్టు చేయాలని అనుకుంటుంది. వెంటనే గన్ తో గురి పెడుతుంది. కానీ ఇదంతా మల్లిక కల కంటుంది. పక్కనే ఉన్న విష్ణుతో ఇలా జరిగిందని చెబుతుంది. కాసేపు విష్ణు (Vishnu) తనను ఆట పట్టిస్తాడు. తరువాయి భాగంలో జానకి నిర్ణయాన్ని అడుగుతుంది జ్ఞానంబ.

click me!

Recommended Stories